యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. స్టార్ డైరక్టర్, స్టార్ హీరో ఈ ఇద్దరు కలిసి చేసే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై నందమూరి ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలకు తగినట్టుగా సినిమా బిజినెస్ కూడా జరుగుతుంది.


తారక్ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా అరవింద సమేత సినిమా బిజినెస్ జరుగుతుంది. అన్ని ఏరియాల్లో కెరియర్ బెస్ట్ ప్రైజ్ వస్తుండగా సీడెడ్ లో ఎన్.టి.ఆర్ స్టామినా తెలియచేసేలా ఏకంగా 15 కోట్లకు ఈ సినిమా బిజినెస్ జరిగిందట. సీడెడ్ లో ఈ రేంజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో టాప్ 3గా నిలిచింది అరవింద సమేత వీర రాఘవ.


ఎలాగు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా అంత రాయలసీమే అందుకే సీడెడ్ సత్తా చాటేలా బిజినెస్ జరిగింది. ఇక సీడెడ్ లో బాహుబలి సినిమా పాతిక కోట్ల బిజినెస్ చేసి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 16.5 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. అరవింద సమేత ముందు రంగస్థలం 12 కోట్లతో టాప్ 3 లో ఉండగా తారక్ సినిమా 15 కోట్లతో దమ్ము చూపించింది. 


సీడెడ్ లోనే కాదు ఎన్.టి.ఆర్ స్టామినా ప్రూవ్ చేసేలా అన్ని ఏరియాల్లో వీర రాఘవ వీరత్వం చూపిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దిగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: