భారత దేశంలో ఇప్పుడు కేరళా పేరు చెబితే..ఎవరైనా కన్నీటి పర్యంతం అవుతున్నారు.  పదిహేను రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లాయి..ఏకంగా కొన్నిబిడ్జీలే కూలిపోయాయి.  రాష్ట్రం మొత్తం జలదిగ్భందంలో ఉంది.  భారీ వ‌ర్షాల వ‌ల‌న ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఎంద‌రో నిరశ్ర‌యిల‌య్యారు. ఇప్పుడే ప‌రిస్థితి కొంత మెరుగుప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.  కేరళా వరదబాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్‌, మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ల‌కి చెందిన హీరోలు ముందుకొచ్చి విరాళాలు అందించారు. 
Image result for kerala floods
ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ 75 ల‌క్ష‌లు, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోటి రూపాయ‌లు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించారు.  ఇదిలా ఉంటే..నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న లారెన్స్ రాఘవేంద్ర కేర‌ళ సీఎం పినరయి విజయన్ ను క‌లిసి తాను కోటి రూపాయ‌ల విరాళాన్ని అందించ‌నున్న‌ట్టు లారెన్స్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. కేవ‌లం సినిమాలతోనే కాదు సామాజిక సేవలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సంగ‌తి తెలిసిందే.
Image result for kerala floods
కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు అండగా ఉండే లారెన్స్ ఆ మ‌ధ్య‌ ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసారు.   ప్ర‌జ‌ల‌ని డైరెక్ట్‌గా క‌లిసి వారికి సాయం అందించేందుకు ముఖ్య‌మంత్రి అనుమ‌తి కూడా తీసుకుంటాన‌ని లారెన్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  కేరళా లో బాధపడుతున్నవారు త్వ‌ర‌గా పునర్నిర్మాణం జ‌రుపుకోవాల‌ని ఆ రాఘ‌వేంద్ర స్వామిని కోరుకుంటున్న‌ట్టు లారెన్స్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: