శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఆరోపణలు కోలీవుడ్ కి కూడా తాకాయి . అయితే ఈ విషయం మీద ఇప్పటికే చాలా హీరోయిన్స్ స్పందించారు. తాజాగా ఈ లిస్ట్ లోకి రష్మి కూడా చేరిపోయింది. తనను ఇప్పటివరకు ఎవరూ గోకలేదంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. దీంతో పాటు కాస్టింగ్ కౌచ్ పై సూటిగా స్పందించింది. 

Image result for rashmi

అంతకుమించి సినిమా నిర్మాత నన్ను గోకలేదు. ఇతడే కాదు, ఏ ప్రొడ్యూసర్ నన్ను అలా చేయలేదు. కాస్టింగ్ కౌచ్ విషయంలో నేను చాలా నిజాయితీగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈమధ్య చాలా పెద్దపెద్ద విషయాలు జరిగాయి. అవన్నీ నాకు తెలుసు. శ్రీరెడ్డి సిచ్యువేషన్ కావొచ్చు, మరొకరి పరిస్థితి కావొచ్చు.. ఉదంతం ఏదైనప్పటికీ ఎవరూ మనల్ని రేప్ చేయలేరు, బలవంతం చేయలేరు."  ప్రతి విషయంలో 'నో' అని చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుందంటోంది రష్మి. 

Image result for rashmi

కాస్టింగ్ కౌచ్  అనేది ఓ ఛాయిస్ అంటాను నేను. దాన్ని నేను గౌరవిస్తాను కూడా. అంతా పాజిటివ్ గా ఉంటుంది, కెరీర్ బాగుందనిపిస్తే కాస్టింగ్ కౌచ్ కు ఓకే చెప్పొచ్చు. ఇద్దరి అంగీకారంతో జరిగేది అది. కాస్టింగ్ కౌచ్ అనేది పర్సనల్ ఛాయిస్ మాత్రమే. అంతెందుకు, ఈ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ ఉంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని ఇంత పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: