81 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో నిన్న జరిగిన టాస్క్ పుణ్యమాని ఎవరైతే ఇంట్లో స్ట్రాంగ్ కంటెస్టంట్ అని చెప్పుకుంటున్నామో అతనికి పెద్ద దెబ్బ పడింది. బిగ్ బాస్ లక్సరీ బడ్జెట్ టాస్కులో భాగంగా నిన్న మర్డరర్ కనిపెట్టే ఆట ఆడారు. అందులో డిటెక్టర్ గా గణేష్, పోలీస్ గా రోల్ రైడా చేశారు. 


మర్డరర్ గా గీతా తన తెలివి తేటలను ఉపయోగించి బిగ్ బాస్ ఇచ్చిన 5 టాస్కులను కంప్లీట్ చేసింది. అయితే ఈ టాస్క్ పూర్తి చేస్తే తనకు స్పెషల్ పవర్స్ ఇస్తారని చెప్పాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఒక ఇంటి సభ్యుడిని ప్రతి వారం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి టాస్క్ గెలిచిన గీతా మాధురి కౌశల్ ను టార్గెట్ చేస్తుందని తెలుస్తుంది.


ఈరోజు జరుగబోయే ఎపిసోడ్ కమింగ్ అప్ చూపించగా గీతా కౌశల్ నే ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది కౌశల్ కు శిక్షగా వేసినా బయట ఉన్న కౌశల్ ఆర్మీ అందుకుందని చెప్పొచ్చు. ప్రతి వారం వారి కాన్సెంట్రేషన్ మొత్తం కౌశల్ ను సేవ్ చేసేందుకే పెట్టుకోవాల్సి వస్తుంది. గీతా మాధురి కౌశల్ ఆర్మీకి గట్టి పనే చెప్పిందని అంటున్నారు కొందరు.


ఇక గీతా కౌశల్ ను సీజన్ మొత్తం నామినేట్ చేసినందుకు కౌశల్ ఎలా రియాక్ట్ అయ్యాడన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. చూస్తుంటే గీతా, కౌశల్ ఫైట్ బాగా ముదిరిందనే అనిపిస్తుంది. మరి ఈ నామినేషన్స్ నుండి నెగ్గి కౌశల్ నిజంగా టైటిల్ గెలుస్తాడా లేదా అన్నది కాస్త కషమే అని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: