తెలుగు ఇండస్ట్రీలో నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మెహ్రీన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దర్శకుడు అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు.  తాజాగా వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

Image result for venkatesh f2 movie

పూర్తి వినోదాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇక వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది.  రెండు నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ సినిమా కారణంగా తమన్నా .. మెహ్రీన్ మంచి స్నేహితులైపోయారు.  తాజగా ఎఫ్ 2 సినిమా సెట్స్ లో  ఈ ముద్దుగుమ్మలిద్దరూ  ఫోటోలకు ఫోజిచ్చారు. వాటిని మెహ్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


ఈ పిక్స్‌ని ట్విటర్‌లో చూసిన నెటిజన్లు ఈ బ్యూటీస్ ఇలా తయారయ్యారేంటని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ‘ఇద్దరు బ్యూటీలను చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు’ అని ఒకరు.. ‘ఇద్దరు ఏంజిల్స్ లుకింగ్ గ్రేట్’ అని మరొకరు.. ‘వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా..’ అని మరికొందరు ఇలా రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.   మాస్ ఆడియన్స్ .. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించడం అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందువలన ఈ సినిమాపై అన్నివర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు వున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: