టాలీవుడ్ లోకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత తమ్ముడు, తొలిప్రేమ, సుస్వాగతం సినిమాలో హీరోగా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.   ఇక గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో మాస్ ఇమేజ్ బీభత్సం పెంచుకున్నాడు.  అయితే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించారు.  కానీ పోటీలో మాత్రం నిలబడలేదు.  వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయున్న విషయం తెలిపారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే నేడు. 

ఇండస్ట్రీలో అయినా..రాజకీయాల్లో అయిన ఆయన స్టైలే వేరు. ఏమి చేసినా కొత్తగానే కనిపిస్తుంది.  ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సామాన్యుడి నుంచి సామాజిక శాస్త్రవేత్తగా పవన్ చేస్తున్న రాజకీయ ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించారు. జనసేనకు చెందిన శతాగ్ని టీమ్ రూపొందించిన ఈ వీడియో జన సైన్యంలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది.  ‘భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైనప్పటికీ ప్రజల జీవితాలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అణగారిన, బడుగు, బలహీనవర్గాలు గాడాంధకారంలో కూరుకుపోయాయి.

దశాబ్దాలుగా పాలకుల్లా ఉన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలిపి రాజకీయ విలువలను భూస్థాపితం చేశారు. సామాన్యుడి జీవితం అస్తవ్యస్తమైంది. ఇవన్నీ గమనిస్తున్న ఒకరి కడుపు మండింది’’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఈ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి..ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ఆయనకు కీలకంగా మారాయి. అందుకే ప్రజలతో ఇప్పటి నుంచి మమేకమై తిరుగుతున్నారు.   ఈ వీడియె లో చివర్లో మార్పు కోసం.. సామాజిక శాస్త్రవేత్త పవన్ కళ్యాణ్ అంటూ ముగించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: