అందం, అభినయం ఒకే చోట ఉంటే పట్టడం కష్టమే. ఈ భామ కూడా అందంతో కొడుతోంది. అభినయంతో పడగొడుతోంది. అందరికీ తెర పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ ఇంకా తగలలేదు కానీ తన బ్యూటీతో మాత్రం మతి పోగొట్టేస్తోంది. సూపర్ డూపర్ హిట్ ఒకటి తన ఖాతాలో వేసుకోవడానికి ఈ అమ్మడు చేస్తున్న ట్రయల్స్ అన్నీ ఇన్నీ కావు ఇంతకీ ఆమె పేరు చెప్పలా. ఆమే మెహ్రీన్ ఫీర్జదా 


తెలుగులో  యంగ్ హీరోల పక్కన నటించిన మెహ్రీన్ ఫీర్జదా బిగ్ చాన్స్ ఇంకా రాలేదు అంటోంది. ఆమె ఇప్పటికే నాని - శర్వానంద్ - సందీప్ కిషన్ - సాయిధరమ్ - వరుణ్ తేజ్,  ఇలా ఈ భామ లైనప్ అంతా కుర్ర హీరోలతోనే. మాస్ మహారాజా రవితేజ సరసన రాజా ది గ్రేట్ చిత్రంలో నటించింది. కెరీర్ లో మూడు హిట్లు ఉన్నాయి. అయితే అమ్మడి రేంజికి అవి చాలవు. పెద్ద హిట్ ఒకటి కావాలంటోంది. అందుకోసం ఏమైనా చేస్తానంటోంది.



ఈ చిన్నది ఇపుడు వరుణ్ తేజ్ సరసన ఎఫ్2  - దేవరకొండ సరసన నోటా చిత్రాల్లో నటిస్తోంది. ఆమె సైన్ చేయాలే  కానీ చాలా మూవీస్ లైన్లో ఉన్నాయి. అయితే ఇపుడిపుడే టాలివుడ్ గురించి అన్నీ తెలుసుకుంటున్న ఈ గ్లామర్ బేబీ ఒకేసారి అన్ని మూవీస్ ఒప్పేసుకోనని అంటోంది. సెలెక్టివ్ గా ఉంటానని చెప్తోంది. అభినయం కూడా ఇంపార్టంట్ అంటోంది. మొత్తానికి టాలీవుడ్లో లాంగ్ టైం లైఫ్ ఉండేలా బాగానే ప్లాన్ చేసుకుంటోంది. ఆల్ ది బెస్ట్ మెహ్రీన్


మరింత సమాచారం తెలుసుకోండి: