ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు రచ్చ రచ్చ అవుతుంది.  ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంది.   ఇంట‌ర్నెట్ ద్వారా ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏం జ‌రిగ‌న క్షణాల్లో తెలిసిపోతుంది.  తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.హాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై బ‌హిరంగంగా చేయి వేయడం సంచ‌ల‌నంగా మారింది.హాలీవుడ్ నటి డకోటా జాక్సన్ త‌ను న‌టించిన ‘సస్పీరియా’.

ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి డకోటా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో  ద‌ర్శ‌కుడు ఆమె బ్రెస్ట్‌పై చేయి వేసిన‌ట్లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో దుమారం రేపాయి.  మొన్నటి వరకు హాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ తెగ హడావుడి చేసిన హీరోయిన్లు ఈ విషయం పై ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యం అంటున్నారు.  పైగా సదరు హీరోయిన్ డైరెక్టర్ తన చేతులు అక్కడ పెట్టినే ఏ మాత్రం స్పందించకుండా నవ్వుతూ ఉండం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

మరోవైను ఈ విషయంపై హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది.   రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజ్‌లు ఇస్తున్న సమయంలో డకోటా డ్రస్ కిందికి జారింది. దాంతో దర్శకుడు ఆమె ప్రైవేట్ పార్ట్ కు చేయి అడ్డం పెట్టాడు ,అంతే తప్ప చేయితో టచ్ చేయలేదని ,కాని ఫోటోల‌లో ట‌చ్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని తెలిపింది డకోటా. పైగా తన పరువు కాపాడటానికే ఆయన అలా చేశాడని..అందులో ఏమాత్రం దురుద్దేశం లేదని వివరణ ఇచ్చింది. ఈ విషయన్ని డకోటా కూడా చాలా లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: