బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే ప్రభాస్ సినిమా మొదలపెడితే దాని బడ్జెట్ ఖచ్చితంగా 100 కోట్లు దాటి పోవాల్సిందే. ఈరోజు పూజ జరిగిన బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ సినిమా బడ్జెట్ కూడా వందకోట్ల ఫైమాటే అని తెలుస్తోంది. ఈ సినిమా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ ఫిల్మ్. 1970 నాటి కథాంశం.  దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ ఇచ్చిన లైన్ ను జిల్ డైరక్టర్ రాధాకృష్ణ డెవలప్ చేసి కథగా మార్చారు.


ప్రభాస్ ఇక నుంచి అన్నీ 100 కోట్ల సినిమాలేనా...!

అయితే  బాహుబలితో వచ్చిన నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ని కాపాడుకోవడానికి భారీ సినిమాలు చేస్తూనే వుండాలని ప్రతి చిత్రానికీ భారీ కాన్సెప్టులు, బడ్జెట్టులు పెట్టుకుంటున్నాడు. దీంతో అతనితో మంచి కమర్షియల్‌ సినిమా తీద్దామనుకున్న యువ దర్శకులపై భారం పడుతోంది. సాహో దర్శకుడు సుజిత్‌కి పెద్ద సినిమాని హ్యాండిల్‌ చేసిన అనుభవం ఏది? అతని చేతిలో నూట యాభై కోట్ల సినిమాని పెట్టేసారు.


ప్రభాస్ ఇక నుంచి అన్నీ 100 కోట్ల సినిమాలేనా...!

జిల్‌ తీసిన రాధాకృష్ణకుమార్‌ కూడా ఇప్పుడు అదే రేంజ్‌ ప్రాజెక్ట్‌ తలపెడుతున్నాడు. నిజానికి ఈ యువ దర్శకులు ప్రభాస్‌తో సింపుల్‌ సినిమా తీద్దామని చూసారు. కానీ వారిని ఎంకరేజ్‌ చేసి మరీ పెద్ద సినిమాలు తీయిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో వారి ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌ సదరు చిత్రాలకి ఆటంకంగా మారితే బాధ్యులు ఎవరు?


మరింత సమాచారం తెలుసుకోండి: