టాలివుడ్ అంటే ఉత్తరాది భామలతో సహా అంతా ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఈజీగా చాన్సులు వస్తాయని వారి నమ్మకం. అది నిజం కూడా. కానీ ఇక్కడే మరో మైనస్ కూడా ఉంది. ఆ అమ్మడు వస్తూనే పెద్ద హిట్ మూవీతో రావాలి. అపుడే వెల్లువలా చాన్సులు తన్నుకుంటూ వస్తాయి. అలా కాకపోయిందా  వేస్ట్.  ఆమెది ఇరన్ లెగ్ అంటూ స్టాంప్ వేస్తారు.



అలాంటి అందమొకటి చాన్సుల్లేక తెలుగు తెరకు దూరమైపోయింది. అమె రెజీనా. ఎస్ ఎం ఎస్ పేర్తో సూపర్ స్టార్ క్రిష్ణ అల్లుడు సుధీర్ బాబు నటించిన ఫస్త్ మూవీలో పైర్ ఆమె. అందులో తళుక్కుమన్న రెజీన మీద టాలీవుడ్ పెద్ద లుక్కే వేసింది. మొదట్లో చాన్సులు అలా వచ్చేసాయి. అయితే అవనీ మీడియం రేంజి మూవీసే. పైగా సరకు తక్కువ సినిమా ఎక్కువ అన్నట్లుగా అవి ఉండడంతో రెజీన లక్ అలా వెనక్కు పోయింది. 



అవన్నీ వరసగా ఫ్లాప్ అయ్యాయి. ఇందులో ఆమె తప్పు లేకపఒయినా తెలుగు తెర ఆమెను దూరం పెట్టేసింది. టాలీవుడ్‌లో సినిమాలు లేకపోయినా ఏదోవిధంగా హంగామా చేస్తూనే వుంటుంది తమిళ బ్యూటీ రెజీనా. ఐదేళ్లపాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి, ఆఫర్స్ లేకపోవడంతో కోలీవుడ్ వైపు ఫోకస్ చేసింది. 28 ఏళ్ల ఈ బ్యూటీకి ఇప్పుడు చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి.



హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘7’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన రెజీనా, తాను దేనికైనా రెడీ అంటోంది.
మళ్ళీ టాలీవుడ్ పిలిస్తే అందాల అరబోతను తయార్ అంటోంది మరి. సెంటిమెంట్ ని నమ్మెసే టాలీవుడ్ ఈ ఇరన్ లెగ్ అమ్మడు ని మరో మారు పిలిపిస్తుందా. ఏమో  చెప్పలేం. అప్పట్లో రమ్య క్రిష్ణకు ఇదే ట్యాగ్ తగిలించారు. తరువాత ఏమైంది, . ఆమె సూపర్ స్టార్ డం తో దూకుడు పెంచేయలేదా. చూద్దాం.. రెజీనా కూ ఆ లక్ రావొచ్చేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: