మాస్ మహరాజ్ రవితేజ వరుసగా ఎన్ని సినిమాలు నిరాశ పరచినా ఒక్క హిట్ కొట్టాడంటే మళ్లీ ఆయన ఫ్యాన్స్ కు ఎనర్జీ వచ్చేస్తుంది. రెండేళ్ల తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు నిరాశపరచేలా చేశాడు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్లతో అమర్, అక్బర్, ఆంటోరీ సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా మీద అటు శ్రీను వైట్ల, ఇటు రవితేజ ఇద్దరు చాలా హోప్స్ పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ విఐ ఆనంద్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో కూడా రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.


శ్రీను వైట్ల సినిమాలో ఆల్రెడీ ట్రిపుల్ రోల్ చేస్తున్న రవితేజ విఐ ఆనంద్ డైరక్షన్ లో డ్యుయల్ రోల్ తో అలరించనున్నాడు. ఇంకా స్పెషల్ న్యూస్ ఏంటంటే ఆ డబుల్ రోల్ కూడా రవితేజ తండ్రి కొడుకులుగా కనిపించడమే. కెరియర్ లో మొదటిసారి ఇలా మిడిల్ ఏజ్ గా కనిపిస్తున్నాడు రవితేజ.


ఎక్కడికి పోతావు సినిమా హిట్ అందుకున్న విఐ ఆనంద్ ఆ తర్వాత వచ్చిన ఒక్క క్షణం నిరాశ పరచింది. అందుకే ఈసారి రవితేజతో సినిమా హిట్ కొట్టేలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా రాబోతున్న ఈ సినిమా విఐ ఆనంద్ సినిమాల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: