హరికృష్ణ మరణం తో ఎన్టీఆర్ బాలకృష్ణ ఒకటి అయ్యారని చెప్పాలి. అయితే ఇప్పడూ అందరు ఒకటే చర్చించుకుంటున్నారు. బాలయ్య ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ కు వస్తున్నాడని, అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో చిన్న పాత్రలో అయినా ఎన్టీఆర్ కనిపిస్తాడని వార్తలు పుట్టుకువచ్చేసాయి. వాస్తవానికి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల బోగట్టా ప్రకారం, ఈ పది పన్నెండు రోజుల్లో అస్సలు ఈ రెండు విషయాలు డిస్కషన్ కే రాలేదు.

Image result for jr ntr

సోమవారం నాడు కూర్చుని అరవింద అడియో ఫంక్షన్ వ్యవహారాలు డిస్కస్ చేయాలని మాత్రం ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. అరవింద సమేత.. నిర్మాతలయిన హారిక హాసిని సంస్థ మాత్రం ఈ పంక్షన్ విషయంలో ఎటువంటి ఒపినీయన్ తో లేదు. ఎన్టీఆర్ ఎలా అంటే అలా చేద్దామనే ఆలోచనతోనే వున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా బాలయ్య బాబాయ్ షెడ్యూలు కనుక్కోమని మాత్రం ఎన్టీఆర్ తన మనుషులకు పురమాయించినట్లు తెలుస్తోంది. 

Image result for balakrishna

ఈనెల 20న పంక్షన్ అని ప్రస్తుతానికి అనుకుంటున్నారు. ఆ రోజుకు బాలయ్య ఎక్కడ వుంటారు? బయోపిక్ షెడ్యూలు ఇలాంటివన్నీ తెలుసుకున్న తరువాత, ఈరోజు జరిగే మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం వుంది.  ఫ్యామిలీ మెంబర్లు అంతా ఒకేసారి ఒకేవేదిక పైకి వస్తే, హరికృష్ణ మరణం నేపథ్యంలో మరీ ఎమోషన్ గా మారి, ఫంక్షన్ తీరు మారుతుందేమో అన్న ఆలోచన కూడా వున్నట్లు వినికిడి. అదే సమయంలో బాలయ్య వస్తే, ఫ్యాన్స్ లో వచ్చే జోష్, సినిమాకు పెరిగే బజ్ కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈరోజు లేదా రేపు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: