టాలీవుడ్ లో ఇప్పుడు కామెడీ డైరెక్టర్ గా మారుతికి మంచి పేరు ఉంది.  గతంలో తీసిన సినిమాలు కాస్త మైనస్ అయినా..ప్రేమ కథా చిత్రమ్, కొత్త జంట సినిమాలతో మనోడు ట్రెండ్ మార్చాడు.  ఇక నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మంచి కామెడీ దర్శకుడిగా ముద్ర వేసుకున్నాడు.  తాజాగా మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీతో పాటు ఎమోషన్, యాక్షన్ తరహాలో రూపుదిద్దుకుందని ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది.  అత్త పాత్రలో అలనాటి అందాల నటి రమ్యకృష్ణ నటించింది.  సారి మారుతీ ,నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. 


‘శైలజారెడ్డి అల్లుడు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 13న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగిందని సమాచారం. ఓ వైపు సమంతా యుటర్న్ పోటీలో ఉన్నప్పటికీ అది పూర్తిగా వేరే జానర్ కావడంతో ఓపెనింగ్స్ విషయంలో చాలా ధీమాగా ఉంది యూనిట్. ఇప్పటిదాకా మాస్ సినిమాల పరంగా బలమైన ముద్ర వేయలేకపోయిన చైతు దీంతో అది సాధిస్తాడనే నమ్మకంతో ట్రేడ్ కూడా బాగానే పెట్టుబడులు పెట్టింది.   కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే  పాతిక కోట్ల దాకా సితార సంస్థ అమ్మేసినట్టుగా సమాచారం. 


ఇది చైతు కెరీర్లో ఇప్పటిదాకా జరిగిన ప్రీ రిలీజ్ లో వచ్చిన అత్యధిక మొత్తం. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే అయ్యింది.   రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈచిత్ర విడుదల హక్కులు 19కోట్ల కు అలాగే ఇతర రాష్ట్రాలు,ఓవర్శిస్ లలో కలిపి మరో 5కోట్ల వరకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈలెక్కన ఈచిత్రం 24 కోట్ల వసూళ్లను సాధిస్తే తప్ప సేఫ్ అవ్వదు. మారుతీ గత చిత్రం’ భలే భలే మగాడివోయ్’ 40కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించింది. 

Related image

మరి ఈచిత్రంలో కుడా కామెడీ వర్క్ అవుట్ అయితే 24కోట్లను వసూలు చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. 25 కోట్లకు పైగా షేర్ దాటిస్తే శైలజారెడ్డి అల్లుడు లాభాల్లోకి అడుగు పెడుతుంది. సూపర్ హిట్ టాక్  వస్తే అదేమంత కష్టం కాదు. మారుతీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రమ్యకృష్ణ నరేష్ లు అత్త మామలుగా అను ఇమ్మానియేల్ జోడిగా నటించారు. గోపి సుందర్ ఆడియో ఇప్పటికే విడుదల కాగా అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరు మీదున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: