ప్రముఖ హీరోయిన్ ఆసిన్ జీవితంతో ఆమె కన్నతండ్రి జోసెఫ్ ఆడుకుంటున్నాడని సినిమా వర్గాల్లో టాక్ మొదలయింది. తెలుగు, హిందీలో ఎన్నో సినిమాల్లో రానించిన ఈ కేరళ ముద్దుగుమ్మకు కన్న తండ్రే నిజ జీవితం లో విలన్ గా మారి ఆమె కెరియర్ ను పాడు చేస్తున్నాడని అంటున్నారు.

నిజానికి 400 కోట్ల విలువైన సినిమాలు నడుస్తున్న బాలీవుడ్ లో ఆసిన్ బోలెడు ఆఫర్లు వస్తే కన్న తండ్రి వాటిని స్వయంగా చెడగొట్టాడంటున్నారు. అందుకే ఎంతో టాలెంట్, అందుకు తగ్గ అందం ఉన్న ఆసిన్ ఇప్పడు సినిమాల్లో కనిపించకుండా పోయిందని చెప్పుకుంటున్నారు.

దీనికి లేటెస్టు ఉదహరణ బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘వెల్ కం బ్యాక్’ సినిమాలో మొదట సోనాక్షిని హీరోయన్ గా అనుకుని ఆమె కంటే బాగుంటుందని ఆసిన్ వద్దకు వచ్చారట. ఆసిన్ ఎగిరి గంతేసి ఒప్పుకుంటే తండ్రి జోసెఫ్ వచ్చి కోటిరూపాయలిస్తేనే ఓకే లేదంటే నో అని చెప్పాడట. దీంతో ఆసినిమా నిర్మాత 60లక్షలు ఇక లాస్ట్ అన్నాకూడా జోసెఫ్ ససేమిరా అనడంతో ఆసిన్ క్యాన్సిల్ చేసుకుని వారు శృతిని ఓకే చేసుకున్నారంటున్నారు. ఇలా అన్ని సినిమాలను తండ్రి జోసెఫ్ చెడగొడుతూ ఆమె కెరియర్ ను పాడుచేస్తున్నాడు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: