టాలీవుడ్, కోలీవుడ్ లో ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు.  అసిస్టెంట్ ఫైట్ మాస్టర్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎంతో కష్టపడి పైకి వచ్చారని అంటారు.  సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ ఫైట్ మాస్టర్స్ గా పేరు తెచ్చుకున్న రామ్, లక్షణ్.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నదమ్ములు మాట్లాడుతూ..త్వరలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నామని చెప్పారు. సినిమాలు మానేసిన తర్వాత హైదరాబాద్ వదిలేసి, పల్లెటూరి వాతావరణంలో జీవనం సాగించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

త్వరలో సినిమాలకు గుడ్ బై

తాము పుట్టి పెరిగిన కారంచేడులో చిన్నచిన్న సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని భావిస్తున్నామని చెప్పారు. 1987 లో అసిస్టెంట్ ఫైట్ మాస్టర్స్ గా మొదలైన వీరి ప్రయాణం ప్రస్తుతం టాప్ ఫైట్ మాస్టర్స్ గా దూసుకుపోతున్నారు.రామ్ లక్ష్మణ్ తమ కెరీర్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 వంటి చిత్రాలు వీరికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చాయి. రామ్ లక్ష్మణ్ తెలుగు, తమిళ, మాయలం, కన్నడ భాషల్లో 11 వందలకు పైగా సినిమాలకు ఫైట్స్ అందించారంటే వీరి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

క్రేజీ సినిమాలకు

సినీ పరిశ్రమ హైదరాబాదుకు వచ్చిన తర్వాత వారు ఇక్కడకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.   ఇప్పటి వరకు ఇండస్ట్రీలోని ఎంటువంటి వివాదంలో వీరు రాల దూర్చరు. వారి పని వారు చేసుకుని వెళుతుంటారు.  వీరి చేతుల్లో క్రేజీ ఆఫర్స్ ఉన్నారు. కాగా వీరికి ఇప్పుడు సైరా నరసింహారెడ్డి, మహర్షి వంటి చిత్రాలకు ఫైట్స్ అందిస్తున్నారు. సినిమాలు వదిలేసే విషయం గురించి రామ్ లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: