ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమా జోరు కొనసాగుతుంది.  ఒక బయోపిక్ సినిమా తీయాలంటే..ఎంతో గట్స్ ఉండాలి. ఒక జీవితాన్ని కొట్ల మంది ముందు చూపించడం అంటే..అందులో ఎలాంటి కల్పితాలు ఉన్న విమర్శల పాలు అవుతుంది.  తెలుగు లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ పై మొదట్లో ఎన్నో సందేహాలు వచ్చాయి..సావిత్రి జీవితంలో చివరి దశలో ఎన్నో కష్టాలు పడ్డట్లు గతంలోని వార్తలు.  అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఆమె జీవితంలో ఎలా వెలిగిపోయింది..ఎలా కష్టాలు కొనితెచ్చుకుంది..ఎలా మరణించింది అన్న విషయంపై అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.  దాంతో ‘మహానటి’ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. 

Image result for ntr biopic

ఇక బాలీవుడ్ లో రాజ్ ఇరాని తీసిన ‘సంజు’ సినిమాలో కూడా సంజయ్ దత్ మత్తుకు ఎలా బానిస అయ్యాడు..అక్రమ ఆయుధం ఎలా వచ్చింది..జైలు జీవితం ఎలా గడిపాడు అన్న అంశాలు చూపించడంతో ‘సంజూ’ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’బయోపిక్ వస్తుంది. నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఎన్టీఆర్ గొప్ప నటులు మాత్రమే కాదు గొప్ప రాజకీయ నాయకులు..టీడీపీ ని స్థాపించి తెలుగు వారి గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన మహానేత. 

Image result for ntr biopic

అందుకే ఈ సినిమాలో నటుడిగా..రాజకీయ నాయకుడిగా చూపించబోతున్నారు.  క్రిష్ నటీనటుల విషయంలో కూాడా ఆచీ..తూచీ వ్యవహరిస్తున్నారు.   ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పాత్ర కోసం రానాను తీసుకున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటీవల చిత్రీకరించారు. ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకున్న విషయం తెలిసిందే.

Image result for ntr biopic

రేపు వినాయక చవితి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రానా ఫస్టులుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు.  రానా లుక్ చూస్తుంటే..నిజంగా చంద్రబాబు అప్పట్లో ఇలా ఉన్నారా అనిపిస్తుంది. ఒక రకంగా రానా కెరియర్లో ఇది ప్రత్యేకమైన పాత్ర అనే చెప్పుకోవాలి..."శ్రీ N. చంద్రబాబు నాయుడు 1984"  అంటూ ట్విట్ చేశారు.  ఇక ఈ సినిమాలో ఎస్వీఆర్ పాత్రలో నాగబాబు .. శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: