అక్కినేని కోడలిగా సమంత కొత్త జోష్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏమాయ చేసావే సినిమా నుండి యూటర్న్ వరకు తన నటనతో ఆకట్టుకుంటున్న సమంత తెలుగుతో పాటుగా తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక చైతుతో మ్యారేజ్ తర్వాత కెరియర్ లో కొత్త టర్న్ తీసుకుంది సమంత.


ఇక నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే లేటెస్ట్ గా వచ్చిన యూటర్న్ సినిమా సమంత హిట్ కొట్టింది. కన్నడలో సూపర్ హిట్ అందుకున్న యూటర్న్ సినిమా రీమేక్ గా సమంత చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఇకమీదట కూడా సమంత ఇలాంటి ప్రయోగాలే చేసేట్టు కనబడుతుంది.


అయితే అందం, అభినయంతో అదరగొడుతున్న సమంత సొంత డబ్బింగ్ తో మాత్రం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. సమంత సొంత డబ్బింగ్ తెలుగు భాష మీద ప్రేమతో చెబుతున్నా సరే ఆమె ఎమోషనల్ సీన్స్ లో చెబుతున్న డైలాగ్స్ ఏమి అర్ధం కావట్లేదని అంటున్నారు. 


మహానటితో మొదలైన సమంత సొంత డబ్బింగ్ ప్రయోగం యూటర్న్ సినిమాకు కొనసాగించింది. అయితే యూటర్న్ లో సమంత డబ్బింగ్ మీద నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సొంత డబ్బింగ్ ఆపేసి చిన్మయితోనే సమంత డబ్బింగ్ చెప్పించుకుంటే బెటర్ అంటున్నారు. మరి సమంతకు ఫ్యాన్స్ ఇస్తున్న ఈ సజెషన్ పాటిస్తుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: