ప్రియా వారియర్ అంటే దేశ వ్యాప్తంగానే కాదు..ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మళియాళీ భామ.  ఒకే ఒక్క వీడియోతో ఈ అమ్మడి జాతకమే మారిపోయింది. ఓ వీడియో సాంగ్ లో  ఒక్క‌సారి క‌న్నుకొట్టి ఇండియాను షేక్ చేసింది.  సీని, రాజకీయ, క్రీడారంగానికి చెందిన వారు సైతం ప్రియాకు ఫిదా అయ్యారు.  ఇంత‌గా పాపుల‌ర్ అయిపోయింది ప్రియా వారియ‌ర్ చూపులు.

ఇప్పుడు ఈ భామ‌ను స్టార్ హీరోయిన్లు కూడా ఫాలో అయిపోతున్నారు.  బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అంటే ఎంత హాట్ ముద్దుగుమ్మో అందరికీ తెలుసు.  ఈ భామ కూడా సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూనే ఉంటుంది.  తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న  ‘భరత్’సినిమాలో నటిస్తుంది.  "టైగ‌ర్ జిందా హై" ఫేమ్ అలీఅబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది.  ఈ సినిమాలో దిశాతో పాటు కత్రినా కైఫ్ కూడా నటిస్తుంది.  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు యాడ్స్ లో కనిపిస్తుంది. 

గతంలో దిశ పటాని మోడలింగ్ చేస్తున్న సమయంలో పలు యాడ్స్ లో నటించింది..ఆ యాడ్స్ లో చేసే ఈ అమ్మడిని ఇండస్ట్రీలో తీసుకున్నారు.  తాజాగా ఓ యాడ్ లో  ప్రియా వారియ‌ర్ లా క‌న్ను కొట్టి రెచ్చ‌గొడుతుంది దిశాప‌టానీ. 

అచ్చంగా "ఒరు అదార్ ల‌వ్" సినిమాలో ప్రియా వేసుకున్న క్యాస్ట్యూమ్‌లోనే క‌నిపించింది దిశాప‌టానీ. ఆ యాడ్‌లో పూర్తిగా దిశా అలాగే కనిపిస్తుంది.  భారత దేశ వ్యాప్తంగా పట్టిన  ప్రియా పిచ్చ ఇప్పుడు సెలెబ్రెటీల‌కు కూడా ప‌ట్టుకుంది.  ఈ యాడ్ లో దిశా హాట్..కోపం..రక రకాలుగా స్టిల్స్ తో కనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: