టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. అయితే జేసి అనంత పురం లో బూతులు మాట్లాడటం చాలా మంది ఖండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ డేరాబాబా..' అంటూ ప్రబోదానంద అనే 'స్వామీజీ' వ్యవహారంపై పెద్దరచ్చే జరుగుతోంది. ఆ ప్రబోదానంద, తమ ఆశ్రమంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోదానంద అనుచరులకీ, గ్రామస్థులకీ మధ్య వివాదం రాజుకుంది. వాహనాలు తగలబడ్డాయి.

Image result for jc diwakar reddy

చాలామంది తలలు పగిలాయి. బాధితులంతా సాధారణ ప్రజానీకమే. వారికి అండగా జేసీ దివాకర్‌రెడ్డి నిలబడ్డారు. ఎంపీ కదా, ఆమాత్రం బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ, జనం కోసం ఆందోళన బాటపట్టిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మీడియా సాక్షిగానే బూతులు తిట్టేస్తున్నారు. ఆ బూతుల్ని భరించడం మీడియా ప్రతినిథులకి కనాకష్టంగా మారిపోతోంది. పోనీ, జేసీ దివాకర్‌రెడ్డి బూతులకు సెన్సార్‌ పడ్తోందా.? అంటే, అదీలేదు. జేసీ దివాకర్‌రెడ్డి బూతులే మాట్లాడతారు గనుక, లైవ్‌లో ఆయన్నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టాల్సి వుంటుంది. కానీ, అలాచేస్తే 'టీఆర్పీ కిక్‌' దక్కతు కదా.! అద్గదీ అసలు విషయం.

రెడ్డిగారి బూతులు.. సెన్సారెక్కడ.?

ప్రబోదానంద అనుచరుల దాడిపై జేసీ గుస్సా అవుతున్నారుగానీ, జిల్లాలో జేసీ అండ్‌ టీమ్‌ చేసే అరాచకాల గురించి ఏ గ్రామానికి వెళ్ళినా కథలు కథలుగా చెబుతూనే వుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, నాలుగేళ్ళుగా ఎంపీగా వున్న జేసీ దివాకర్‌రెడ్డి, ప్రబోదానంద ఆశ్రమంపై ఎందుకు ఇప్పటిదాకా మాట్లాడలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పోలీసుల్ని చేతగానివాళ్ళనడం.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోవడం.. ఇదో ట్రెండీ వ్యవహారంగా మారింది జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించి. 

మరింత సమాచారం తెలుసుకోండి: