టాలీవుడ్ లోకి ‘దేవదాసు’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ తర్వాత ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరో మంచి పేరు తెచ్చుకున్నాడు.  దేవదాసు సినిమా తర్వాత ఆ స్థాయిలో రామ్ కి పెద్ద విజయాలు ఏవీ రాలేదు..కాకపోతే ఆ మద్య కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘నేను శైలజా’మరో మంచి సక్సెస్ అందుకున్నాడు.  ఆ తర్వాత మరికొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా హిట్ కాలేదు.  దాంతో మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రామ్  తాజాగా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. ఈ  సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థా చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయడానికి నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన బ్యాక్ మొత్తం కనిపించేలా కూర్చుని.. తన హెయిర్‌ కి సాంబ్రాని పట్టిస్తుంది..వెనుక నుంచి వచ్చిన రామ్.. ఆమెనే చూస్తూ ఉండిపోతాడు.

‘చూశావా.. నీకోసమే..’ అని అనుపమ అనగానే ఆశ్చర్యపోతాడు రామ్. వెంటనే ‘కాఫీ.. నీ కోసమే’ అని అనుపమ చెబుతుంది.  ఆ తర్వాత హీరోయిన్ అనుపమా ఎలా ఉంది..? అన్న ప్రశ్నకు రామ్ ‘హా..హాట్‌గా ఉంది..’ అంటూ రామ్ సమాధానమిస్తాడు. మొత్తానికి  అవుట్‌పుట్ చాలా బాగా వ‌స్తోంది. త‌ప్పకుండా ప్రేక్షకుల‌ను అల‌రించేలా ఈ సినిమా ఉంటుందన‌డంలో సందేహం లేదు  అన్నారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: