హిందిలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగులోకి తీసుకొచ్చారు స్టార్ టివి నిర్వాహకులు. మాటివి స్టార్ లో విలీనం అవడం.. స్టార్ మాగా మారిన అనంతరమే బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలవడం జరిగింది. మొదటి సీజన్ అందరిని సర్ ప్రైజ్ చేసేలా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు.


ఎన్.టి.ఆర్ వాక్ చాతుర్యం.. స్పాంటీనిటీ షోని సూపర్ సక్సెస్ చేశాయి. ఇక సెకండ్ సీజన్ కు ఆయన అందుబాటులో లేక పోవడం వల్ల నాచురల్ స్టార్ నానిని హోస్ట్ గా ఎంచుకున్నారు. ఎన్.టి.ఆర్ తర్వాత నాని అనగానే బిగ్ బాస్-2 మీద కూడా అంచనాలు పెరిగాయి. అయితే వాటిని నాని ఏమాత్రం అందుకోలేకపోయాడు.


మొదట్లో కాస్త తడబడిన నాని ఈమధ్య కాస్త పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. అయితే ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూ షో హోస్ట్ గా చేయడం కష్టమే కాని ఎన్.టి.ఆర్ దాన్ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశాడు. వీకెండ్ లో స్క్రిప్ట్ రైటర్స్ స్క్రిప్ట్ ఇచ్చినా దాన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకుని హౌజ్ మెట్స్ తో మంచి డిస్కషన్స్ నడిపాడు.


అయితే నాని మాత్రం స్క్రిప్ట్ ను స్క్రిప్ట్ లానే చెబుతున్నాడు. ఎలాంటి సొంత బుర్ర వాడట్లేదని టాక్. అంతేకాదు షో చూడకుండా కేవలం స్క్రిప్ట్ రైటర్స్ ఇచ్చే స్క్రిప్ట్ పట్టుకుని అవే రిపీట్ చేస్తుంటే మాత్రం ఆడియెన్స్ కు నచ్చట్లేద్. బిగ్ బాస్ షో నాని అనవసరంగా చేశాడని అంటున్నారు. షోకి ముందు నానికి నాచురల్ స్టార్ అన్న స్క్రీన్ నేమ్ సహజ నటుడు అన్న క్రేజ్ ఉండేది బిగ్ బాస్ చేయడం వల్ల కొంతమంది ఫ్యాన్స్ ను అతను దూరం చేసుకున్నాడని అంటున్నారు. కచ్చితంగా నాని తర్వాత సినిమాల మీద బిగ్ బాస్ ఎఫెక్ట్ పడుతుంది అన్నది కొంతమంది వాదన.   



మరింత సమాచారం తెలుసుకోండి: