అందానికి అడ్రెస్ నేనే అంటోంది నభా నటేష్. గుమ్మెత్తించే సోయగాలతో కనుల విందు చేసుకోమంటోంది. తెలుగులో ఇంకా ఇక్క మూవీ కూడా విడుదల  కాలేదు కానీ ఈ అమ్మడు అపుడే హాట్  హాట్ పోజులిచ్చేస్తోంది. లేటెస్ట్ గా  జ‌రిగిన సైమా అవార్డ్ల వేడుకల్లో  నభా  నటేష్ ఓ రేంజిలో రెచ్చిపోయింది. కుర్ర కారుతో కేక పెట్టించింది. వంపు సొంపులతో కిక్కెంచేసింది. అక్కడ ఆట పాటలతో అలరించిన నభా నటేష్  సినిమా కోసం యువజనం క్యూ కట్టేందుకు సిధ్దమైపోయారు.  ఇక టాలివుడ్ కొత్త అందంగా మెరిసేందుకు నేను  రెడీ అంటోంది.


కన్నడ బ్యూటీ తెలుగు తెరను తరింపచేసేందుకు ఇటు వైపు వచ్చేసింది.  ఆనంద్ అనే కన్నడ సినిమాలో నటించింది. పటాకా పార్వతిగా పాపులరైందక్కడ. ఆ తర్వాత సుధీర్ బాబు సరసన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులోకి వస్తోంది  సుధీర్‌బాబు, నభా నటేశ్‌ జంటగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈచిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది.. . ఇటీవలే రిలీజైన ట్రైలర్ లో నభా నటన ఆకట్టుకుంది. మాంచి జోరు మీదున్న ఈ అమ్మడు తీరు చూస్తుంటే హాట్ హాట్ చాన్సులను ఇట్టే పట్టేసేలా కనిపిస్తోంది. 


ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడిన నభా నటేష్ నన్ను దోచుకుందువటే.  విడుదల పరంగా చూస్తే నా డెబ్యూ మూవీ అని చెప్తోంది.  నా కన్నడ మూవీస్‌ చూసిన దర్శకుడు ఆర్‌ఎస్‌ నాయుడుగారు తకకు నేను సరిపోతానని భావించి తనను అప్రోచ్‌ అయినట్టు తెలిపారు. నేను కన్నడ అమ్మాయిని.. తెలుగుమాట్లాడటం వచ్చు.. . తెలుగు సినిమాల్లో నటించటం వల్ల తెలుగు నేర్చుకున్నాను.. నేను బేసిక్‌గాథియేటర్‌ ఆర్లిస్టుని.. నా డైలాగులు నేను చెప్పుకోవాలన్నది కోరిక అంటోంది.


. కాలేజీ చదివే రోజుల్లోనే నేనుథియేటర్‌ ఆర్టిస్టుగా కోర్సు చేశాను. చాలా స్జేజ్‌ షోస్‌ చేశాను.. మూవీస్‌లో రావాలనే ఆలోచనలతోనే థియేటర్లు కోర్సు నేర్చుకున్నాను.. అలాగే మోడలింగ్‌ కూడచేశాను.. మోడలింగ్‌ పట్ల ఫ్యాషన్‌ గురించి విషయాలు తెలుసుకున్నాను.. థియేటర్‌ కోర్సు తో నటన గురించి అవగాహన ఏర్పడింది.. థియేటర్లుతో పోలిస్తే కెమెరా యాక్టింగ్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా గలగలమని ఛాలా విషయాలే చెప్పేసింది.



నను దోచుకుందువటే.. సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉన్న పాత్రచేశాను.. చాలా కూల్‌గానే సినిమాను పూర్తిచేశాను.. ఇలాంటి పాత్ర చేయటం నాకుచాలా సంతోషాన్ని వచ్చింది.. ప్రతిరోజు కొత్తగా అన్పించేది. మొత్తానికి ఈ సినిమా అందరికీ బాగా నచ్చుతుందని అంటోంది. ఈ మూవీతోనే హిట్ కొట్టి తెలుగులో  పాగా వేయాలని డిసైడ్ అయిన నభా నటేష్ కి ఆల్ ద్ బెస్ట్ 


మరింత సమాచారం తెలుసుకోండి: