టాలీవుడ్ లో ఈ మద్య కామెడీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.   ప్రముఖ దర్శకులు వివివిసత్యనారాయణ తనయుడు అల్లరి నరేష్ కామెడీ హీరోగా ‘అల్లరి’ సినిమాతో పరిచయం అయ్యాడు.  అప్పటి నుంచే ఎన్నో కామెడీ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.  ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ కి ఏ సినిమా కలిసి రావడం లేదు. దాంతో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.  ప్రస్తుతం పైడిపల్లి వంశి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’ సినిమాతో క్యారెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. 

ఇక తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. మర్యాద రామన్న సినిమాలో ఘన విజయం అందుకున్న సునీల్ వరుసగా కొన్ని కామెడీ సినిమాల్లో నటించాడు.  అయితే సునీల్ కి కూడా గత కొంత కాలంగా ఏ సినిమా హిట్ కాకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ సినిమాతో కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్నాడు. ఇటీవలే విడుదల అయిన అల్లరి నరేష్ - సునీల్‌ల సినిమా ‘సిల్లీ ఫెలోస్’రిలీజ్ అయ్యింది. 

భిమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సిల్లీఫెలోస్’ డివైట్ టాక్ తెచ్చుకుంది.  కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా బాగానే నచ్చింది.  కాకపోతే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా పెద్దగా ఆసక్తిని రేపలేకపోయింది...దాంతో భారీ కలెక్షన్లు రాబట్టలేక పోయింది.  అయితే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో బయటపడిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాను దాదాపు ఆరు కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారట.   టీవీ ప్రసార హక్కులే నాలుగు కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయట.  ఇక తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా  రెండు కోట్ల రూపాయలకు పై స్థాయి వసూళ్లనే సాధించింది.  మొత్తానికి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా..వసూళ్లతో సేఫ్ జోన్ లోకి వెళ్లింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: