ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం అరవింద సమేత దసరా భరిలో ఉంది. అయితే ఈ సినిమా లోని ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమా మీద హైప్ ను పెంచేస్తుంది. అయితే  ఈరోజు అంటే బుధవారం మరో సింగిల్ విడుదల చేయబోతున్నారు. పెనిమిటి అనే సాంగ్. ఈ పాట గురించి ట్విట్టర్ అప్పుడే హోరెత్తుతోంది. ఇలాంటి పాట రాసే అవకాశం తనకు రావడం తన అదృష్టం అంటున్నారు రామజోగయ్య శాస్త్రి. మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఇది మామూలు పాట కానే కాదు అంటున్నారు. 

Image result for jr ntr aravinda sametha

ఈ పాట తను విన్నానని, దశాబ్దాలపాటు నిలిచి వుంటుందని అంటున్నారు దర్శకుడు సుధీర్ వర్మ. అంతేకాదు, పాటలోని ప్రతి పదం ట్వీట్ చేయాలని వుందంటున్నారు ఆయనే. ఈ పాట ఓ జాలిపాట కమ్ లాలి పాట అని తెలుస్తోంది. హీరో తల్లి 'పెనిమిటి? ఓ పెనిమిటి?' అని పాడుతుంది. హీరో చిన్నపుడు తనకోసం తల్లి లాలి పాట పాడుతోందనుకుంటాడు. కానీ తన భర్తను గుర్తు చేసుకుని బాధపడుతోందని పెద్దయ్యాక గుర్తిస్తాడు. అదీ సాంగ్ సిట్యువేషన్ అని తెలుస్తోంది.

Image result for jr ntr aravinda sametha

రామజోగయ్య శాస్త్రి, సుధీర్ వర్మ ఇంకా ఇతరుల హడావుడి చూసి,  ఈ పాటకు ఇంత హైప్ ఏమిటి? నిజంగా అంతలా వుంటుందా? లేకపోతే ఊరుకోము అంటూ ఫ్యాన్స్ ఓ లెక్కలో రీ ట్వీట్ లు ఆన్సర్లు కొడుతున్నారు. ఇప్పుడు ఇదే కాస్త కలవరపెడుతోంది. పాట బాగుంటుందని, క్లాస్ సాహిత్యం వుంటుందని తెలుస్తోంది. ఈ రోజుల్లో ఏ పాటా కూడా మరీ దశాబ్దాలు నిలిచిపోయేంత సీన్ వున్నవి లేవు. ఇలా మోసేయడం వెనుక మ్యూజిక్ డైరక్టర్ థమన్ వున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతగాడు తన సర్కిల్ అందరికీ పాట వినిపించి, ముందే ట్విట్టర్ లో హడావుడి చేయించడం అన్నది కామన్ అని, అయితే ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోకు అలా చేస్తే, పాట అప్ టు ది మార్క్ లేకపోతే, ట్విట్టర్లో ఓ రేంజ్ లో ఆడేసుకుంటారని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: