త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలంటే మాస్ డాన్సులుండాల్సిందే. ఎంత క్లాస్ స్టోరీ తీసుకున్నా సినిమాకు ఊపు తేవ‌డానికి ఒక్క మాస్ స్టెప్ అయినా ప‌డాల్సిందే. అందుకే మ్యాగ్జిమ‌మ్ ప్ర‌తీ స్టార్ హీరో సినిమాలోనూ ఒక ఐటం పాట తూచ త‌ప్ప‌కుండా పెడుతుంటారు.

Image result for junior ntr aravinda sametha

ఇప్పుడా ఒర‌వడి కాస్త త‌గ్గుతున్నా? వీలైనంత వ‌ర‌కూ ఇరికించేలానే డైరెక్ట‌ర్లు ప్ర‌య‌త్నిస్తుంటారు. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `అరవింద స‌మేత వీర రాఘ‌వ‌`లో న‌టిస్తున్నాడు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్న చిత్రం కావ‌డంతో సినిమా ఎంత మాస్ గా ఉంటుందో? అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మాస్ జ‌నాల‌ను ఊపేస్తోంది. ఎన్టీఆర్ అభిమానుల‌ను అయితే ట్రైల‌ర్ కాల‌ర్ ఎగ‌రేసేలా చేసింది.

Image result for junior ntr aravinda sametha

యూ ట్యూబ్ లో ఇప్ప‌టికీ ట్రెండింగ్ లో ఉంది. ఇలాంటి మాస్ అప్పీరియ‌న్స్ ఉన్న క‌థ‌లో..హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉన్న సినిమాలో ఎన్టీఆర్ డాన్సులు వేయ‌క‌పోతే ఎలా? అనుకుంటాం. త్రివిక్ర‌మ్ కూడా అలా ఆలోచించే ఎన్టీఆర్ క్యాలిబ‌ర్ ను బట్టి మంచి స్టెపుల‌తో ఓ సాంగ్ చేయించాల‌నుకున్నారుట‌. ఆ పాట షూటింగ్ అమెరికాలో చేయాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ కు అంత స‌మ‌యం లేక‌పోవ‌డంతో ఆ పాట‌ను సినిమా నుంచి తొల‌గించారుట‌. అంటే ఎన్టీఆర్ డ్యాన్సులు చూసే అవ‌కాశం సినిమాలో లేన‌ట్లేన‌ని తెలుస్తోంది. సినిమాలో కేవ‌లం నాలుగు పాట‌లే. మరీ ఈ నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడే చెప్పలేము..!

మరింత సమాచారం తెలుసుకోండి: