నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మరో రెండు వారాల్లో పూర్తి కాబోతుంది. ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్న ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ నుండి ఈ వారం మరో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా ఉన్న ఐదుగురిలో ఒకరు టైటిల్ విన్ అవుతారు. మొదటి నుండి హాట్ హాట్ గొడవలతో సాగుతున్న బిగ్ బాస్-2 టైటిల్ విజేత ఎవరన్నది గెస్ చేయడం కాస్త కష్టమే.


కౌశల్, గీతా మాధురిలకు మొదట ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుండగా. తనీష్, సామ్రాట్, రోల్ రైడాలకు బిగ్ బాస్-2 టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉంటే బిగ్ బాస్ ఫైనల్స్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ కు కింగ్ నాగార్జున వస్తున్నాడని అన్నారు. 


కాని నాగార్జున ప్లేస్ లో ఎన్.టి.ఆర్ వస్తున్నాడట. మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్.టి.ఆర్ రావడమే కరెక్ట్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్టింగ్ లో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ సీజన్ హోస్ట్ నాని కూడా ఫైనల్స్ లో ఉంటాడు. అంటే నాని, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ హోస్ట్ చేస్తారన్నమాట.


ఎన్.టి.ఆర్ ప్రస్తుతం అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆడియో ఈరోజు రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. ఎన్.టి.ఆర్ రాకతో బిగ్ బాస్ 2కి భారీ టి.ఆర్.పి రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: