ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన కియరా అద్వాని తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మహేష్ పక్కన హిట్ కొట్టిన అమ్మడికి ఆ వెంటనే చరణ్ సినిమాలో ఛాన్స్ లభించింది. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న కియరా అద్వాని బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది.   


లస్ట్ స్టోరీస్ లో హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించిన కియరా అద్వాని హింది అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించింది. ఆ సినిమా తర్వాత విజయ్ ఫాలోయింగ్ ఏంటన్నది అందరిలి తెలిసిందే.


ఇక ఈ సినిమా తమిళ వర్షన్ లో విక్రం తనయుడు ధ్రువ్ నటిస్తుండగా హిందిలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ అర్జున్ రెడ్డిని నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ముందు తారా సుతారియాని హీరోయిన్ గా అనుకున్నా ఆమె వేరే ప్రాజెక్ట్ తో బిజీ అవడం వల్ల ఈ సినిమాలో నటించే అవకాశం లేదని చెప్పేసిందట.


అందుకే కియరా అద్వానితో సాహిద్ కపూర్ జోడి కడుతున్నాడు. లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయని తెలిసినా తెలుగులో ఆల్రెడీ హిట్టైన సబ్జెక్ట్ కాబడంతో కియరా ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిందట. మరి తెలుగులో అర్జున్ రెడ్డి సాధించిన విజయాన్ని హింది వర్షన్ మించే హిట్ అవుతుందో లేదో చూడాలి. 
   



మరింత సమాచారం తెలుసుకోండి: