తమిళ స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న హీరో విజయదళపతి విజయ్.  తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్  తర్వాత అంత క్రేజ్ సంపాదించాడు విజయ్.  నటన, డ్యాన్స్, యాక్షన్ పరంగా తమిళ తంబీల హృదయాలు గెలుచుకున్నాడు.  విజయ్ సినిమా రిలీజ్ అవుతుందటే..అక్కడ పండగు వాతావరణం నెలకొంటుంది.  తాజాగా  సూపర్ స్టార్ విజయ్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది.  హీరో విజయ్ కి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది.   

ఇండస్ట్రీలో ఇలాంటి  అవార్డులు రావడం విజయ్‌కు కొత్త కాకపోయినప్పటికీ.. ఇది అతనికి చాలా ప్రత్యేకం అనే చెబుతున్నారు.  విజయ్ హీరోగా నటించిన ‘మెర్సల్’తెలుగు లో ‘అదిరింది’పేరిట విడుదల అయిన విషయం తెలిసిందే.  ఈ సినిమా రిలీజ్ కి ముందు భారత దేశ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది.  జీఎస్టీ గురించి..నెగిటీవ్ గా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని..డాక్టర్ల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెగ హంగామా చేశారు.  బాలీవుడ్ లో దీపికా పదుకొనె నటించిన ‘పద్మావత్’సినిమాకు ఏ రేంజ్ లో నిరసనలు వచ్చాయో..మెర్సిల్ కి కూడా దాదాపు ఆ తరహా నిరసనలు వెల్లివెత్తాయి. 
Adirindi Is The Biggest Opening Film In Telugu For Vijay
అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత..చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.రికార్డు స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. అంతేకాదు ఈ సినిమాకి యూకే-2018 చలన చిత్రోత్సవంలో ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డు లభించింది.  అంతే కాదు ఇందులో విజయ్‌ నటనకు ఇంటర్నేషనల్‌ రికగ్నిషన్స్‌ అవార్డు (IARA-2018) ప్రకటించారు.లండన్‌కు చెందిన ఓ ప్రముఖ కంపెనీ ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. 

కాగా,  సెప్టెంబరు 22న లండన్‌లోని హిల్టన్‌ హోటల్‌లో ఈ అవార్డుల వేడుక జరిగింది. దీనికి విజయ్‌ హాజరు కాలేకపోయారు. అంతర్జాతీయ వేదికపై మన హీరోలకు ఉత్తమ అవార్డులు రావడం చాలా హర్షించదగ్గ విషయం అని అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అదిరింది’ సినిమాకి అట్లీ దర్శకత్వం వహించగా, సమంత, నిత్యమీనన్, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: