ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ ల పర్వం కొనసాగుతుంది.   సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యంలో పలు బయోపిక్ లు వస్తున్నాయి.  మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా తీశారు.  సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కి ఎంతో గొప్ప పేరు వచ్చింది.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు.  మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఇప్పుడు ఏపి సీఎం చంద్రబాబు జీవిత కథ ఆధారంగా ‘చంద్రోదయం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారుమోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగా వినోద్ నువ్వుల నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  అయితే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్‌ఆర్ బయోపిక్ మూవీలతో పోల్చుకుంటే లీడ్‌ రోల్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయినట్టు లేదు.

ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఎన్టీఆర్‌గా బాలయ్య, వైఎస్ఆర్ బయోపిక్‌లో వైఎస్ఆర్‌గా మమ్ముట్టి ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఫస్ట్ లుక్స్ ఉన్నాయి.  చంద్రోదయం మూవీలో చంద్రబాబు పాత్రధారి చంద్రబాబు కంటే చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. తెలుపు రంగు గెడ్డం అతికించినట్టుగా ఉంది. దీనికి తోడు పోస్టర్స్ కూడా మూవీ స్టిల్స్ కోసం తీసినట్టుగా ఉన్నాయి. 

‘చంద్రోదయం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల సందర్భంగా నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడి పాత్రలొ నటిస్తోన్న వినొద్ నువ్వుల ఈ సినిమా గురించి మాట్లాడుతూ..చంద్రోదయం సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రజలకు మెప్పు పొందేలా వచ్చిందని అన్నారు. చంద్రోదయం’ చిత్రీకరణ పూర్తైంది. నారా వారి పల్లె, తిరుపతి, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేశాము. అక్టోబర్‌లో పాటలను, వెనువెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: