లేటెస్ట్ యువ సంచలనం విజయ్ దేవరకొండ గురించి అందరికి తెలిసిందే.. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం హీరోగా చేసిన 3 సినిమాలతో స్టార్ డం తెచ్చుకున్న హీరో అతను. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వతహాగా టాలెంట్ చూపిస్తూ వచ్చాడు. గీతా గోవిందం విజయం స్టార్ హీరోలకు షాక్ ఇచ్చేలా చేసింది.


ఇదిలాఉంటే తన ఫ్యాన్స్ ను రౌడీస్ అని పిలుస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్న విజయ్ దేవరకొండని స్క్రీన్ నేం గా రౌడీ స్టార్ అని పిలవాలని ఫిక్స్ అయ్యారు. కొందరు తెలంగాణా మెగాస్టార్ అని అంటున్నారు. అయితే మనోడి రౌడీ ఇమేజ్ ను ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ వాడేస్తున్నాడని తెలుస్తుంది.


అదేంటి విజయ్ ఇమేజ్ ను చరణ్ వాడాల్సిన అవసరం ఏముంది అంటే.. చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా స్టేట్ రౌడీ అని పెడుతున్నారట. చిరంజీవి టైటిలే అయినా ఈ టైంలో టైటిల్ లో రౌడీ అని పెట్టి చరణ్ విజయ్ ఇమేజ్ వాడేస్తున్నట్టుగా అనిపిస్తుంది.


1989 లో మెగాస్టార్ నటించిన స్టేట్ రౌడీ సినిమాను బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. అదే టైటిల్ తో బోయపాటి తన మార్క్ చూపించబోతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. మరి రాం చరణ్ చేస్తున్న ఈ స్టేట్ రౌడీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: