అక్కినేని నాగార్జున ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు. ఆయన అటు భక్తి, ఇటు రక్తి ఒకే టైంలో పండించగలరు. విశాలమైన ఆ కళ్ళు ఎన్నో భావాలను పలికిస్తాయి. అలాంటి కళ్ళున్న నటులకు అదొక వరమని కూడా అంటారు. ఇక నటన అని కాకుండా బిహేవ్ చేస్తూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం నాగ్ కి వెన్నతో పెట్టిన విద్య



మరి అంటువంటి నాగ్ కొన్ని పాత్రలు చేయను అంటున్నారు. ఆ పాత్రలు వచ్చినా నో చెబుతానని చెబుతున్నారు. మరి నాగ్ కి అలాటి పాత్రలు ఎందుకు వస్తాయి, ఎందుకు వద్దంటారు అని ఆరా తీస్తే నాగ్ కి తండ్రి పాత్రలు వేయడం అసలు ఇష్టం ఉండదట. నేను ఆ ముసలి పాత్రలు వేయడమేంటని నాగ్ షాకింగ్ ఆన్సర్ ఇస్తున్నారు.



ఇక్కడ నాగ్ ఇంకో మాట కూడా చెబుతున్నారు. నా ఏజ్ ఎంతనుకున్నారు, జస్ట్ పాతికేళ్ళే. నాకు కొడుకులు ఇద్దరు కాదు, వాళ్ళూ నా బ్రదర్స్ అంటూ  చైతూ, అఖిల్ గురించి చెప్పుకొచ్చారు. నేను ఇండస్ట్రీకి  వచ్చి 32 ఏళ్ళు అవుతున్నా ఇంకా కుర్రవాణ్ణేనని కూడా నాగ్ ధీమాగా చెబుతున్నారు. యంగ్ హీరోలతో నటిస్తే ఆ జోష్ మనలోనూ ట్రాన్స్ఫర్ అవుతుందని అందుకే నాని తో దేవదాస్ మూవీ చేస్తున్నాను అంటున్నారు నాగ్. తనకు నచ్చిన పాత్రలు ఉంటే ఏ ఇతర హీరోల పక్కన అయినా నటించేందుకు నో అబ్జక్షన్స్ అంటున్నారు. మొత్తానికి నాగ్ తన మనసులోని భావాలను బాగానే పంచుకున్నారు. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: