ఈ మద్య  సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యంలో బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్నాయి.  తెలుగులో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్వన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమా వచ్చింది. ఈ సినిమాకు ఎక్కడ లేని రెస్పాన్స్ రావడమే కాదు..కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది.  బాలీవుడ్ లో క్రీడా నేపథ్యంలో ఎంఎస్ ధోనీ, సినీ నేపథ్యంలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా చేసుకొని రాజ్ ఇరానీ దర్శకత్వంలో ‘సంజు’ సినిమా వచ్చింది.  ఈ రెండు సినిమాలు కూడా అద్భుత విజయం సాధించాయి. 

ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమాలు రాబోతున్నాయి.  ఇక భారత దేశంలో క్రీడా రంగంలో ముఖ్యంగా   బ్యాడ్మింటన్ క్రీడలో సైనా నెహ్వాల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆత్మస్థైర్యంతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె జీవితచరిత్రను అభిమానుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. బ్యాడ్మింటన్ తో పాటు ఫ్యాషన్ ప్రపంచంపై తనదైన ముద్రను వేసిన సైనా నెహ్వాల్ జీవితాన్ని అద్భుతంగా హిందీలో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రద్ధా కపూర్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ముందే ఫిట్ నెస్ కోసం శ్రద్ధా కపూర్ గట్టిగానే కసరత్తు చేసింది. అందువలన ఫస్టులుక్ లో శ్రద్ధా కపూర్ మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తోంది.  ఈ మద్య శ్రద్దా కపూర్ నటించిన  'స్త్రీ' భారీ వసూళ్లను సాధించింది.  అంతే కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ బయోపిక్ కూడా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో శ్రద్దాకపూర్ వుంది.      


మరింత సమాచారం తెలుసుకోండి: