ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత మూవీ మీద ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరినాయి. అరవింద సమేత సినిమాకు సంబంధించి ఇప్పటికే యాక్షన్ బ్లాక్ ఒకటి లీక్ అయింది. బోయపాటి, కొరటాల సినిమా స్టయిల్ లో మంచి ఎమోషనల్ గా ఉందది. లీక్ అయింది కాబట్టి అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమాలో దీనికి మించిన స్టఫ్ ఇంకోటి రెడీగా ఉంది. అదే ఎన్నికల ఎపిసోడ్.

Image result for jr ntr aravinda sametha

అవును, అరవింద సమేత చిత్రంలో అదిరిపోయే ఎలక్షన్ ఎపిసోడ్ ఉందట. ఎన్టీఆర్ పై తీసిన ఈ స్థానిక ఎన్నికల ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని, త్రివిక్రమ్ విశ్వరూపం ఈ సన్నివేశాల వద్ద కనిపిస్తుందని ఇంటర్నల్ గా ఓ టాక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఊపందుకుంటున్న ఈ టైమ్ లో, అరవింద సమేత చిత్రంలో ఎలక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా అది అందర్నీ ఎట్రాక్ట్ చేసే అంశమే.

Image result for jr ntr aravinda sametha

ఈ ఫైట్ సీక్వెన్స్, ఎలక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సాంగ్స్, రాయలసీమ యాస చూస్తుంటే.. అరవింద సమేత చిత్రం రెగ్యులర్ మూవీలా కనిపించడం లేదు. చూస్తుంటే, ఎన్టీఆర్ ను పెట్టి త్రివిక్రమ్ కాస్త గట్టిగానే ఏదో కొత్తగా ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించి ఐదో పాటపై యూనిట్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న షూటింగ్ ఐదో పాటకు సంబంధించినదే అంటూ కథనాలు వస్తున్నప్పటికీ క్లారిటీలేదు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అరవింద సమేత ఐదో పాటపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: