ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో అద్భుతం సృష్టించడానికి రెడీ అవుతున్నారు.  మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా చేస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం అజర్బైజాన్ లో షూటింగ్ దాదాపు 20 రోజుల పాటు జరుపకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. 

మరికొన్ని ముఖ్యమైన సన్నివేశాలు హైదరాబాద్ లోనే షూట్ చేసి త్వరగా ప్రొడక్షన్ పనులు మొదలు పెడతామని చిత్ర యూనిట్ తెలిపింది.  అయితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు, సన్నివేశాలు లీకేజ్ అవుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాకు సంబంధించి ఫోటోలు లీకేజ్ అయ్యాయి..మొన్నటికి మొన్న ఏకంగా భారీ యాక్షన్ సీన్ ఒకటి లీక్ కావడంతో చిత్ర యూనిట్ తలలు పట్టుకొని కూర్చుంది. 

ఓ వైపు దర్శకుడు త్రివిక్రమ్ ఎంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా జరిగే నష్టం జరిగిపోయింది. ఇక ఫోటోలు, సన్నివేశాలు రిలీజ్ కావడంతో ఆ సినిమా కథ ఇది అని గాసిప్స్ కూడా సృష్టిస్తున్నారు.   అయితే బోయపాటి-రాంచరణ్ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి లీక్ అయిన సంఘటనలు జరగలేదు..ఎంతో గోప్యంగా సినిమా షూటింగ్ ముగించేస్తున్నారు. 

ఇదిలా ఉంటే..ఈ సినిమాకు ‘స్టేట్ రౌడి’ అని టైటిల్ పెట్టారని...ఇందుకు సంబంధించి ఓ ఫోటో వైరల్ కూడా అయ్యింది. కానీ ఇది అధికార ప్రకటన మాత్రం కాదు..ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ అని తేలింది.   విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: