టాలీవుడ్ లో మొదటి సారిగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నిర్మితమైంది.పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి.  ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్.  అయితే రాయలసీయ బ్యాగ్ డ్రాప్ లో వస్తున్న ‘అరవింత సమేత’కు సంబంధించిన కొన్ని లీకేజీలను బట్టి చూస్తుంటే..సీమ పౌరుషం ఏంటో ఈ సినిమాలో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నట్టుంది.   ఇప్పటికే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

థమన్ ఆడియో పూర్తిగా చార్ట్ బస్టర్ కానప్పటికీ సినిమా హై ఎమోషన్లో సాగుతుందనే హింట్ మాత్రం ఇచ్చింది.  ఒకప్పుడు రాజమౌళి, వివివినాయ్ దర్శకత్వంలో సీమ పౌరుషం గురించి ఎన్టీఆర్ ని ఎమోషనల్ క్యారెక్టర్ లో చూపించాడు.  ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూపించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.    ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రచారం జరిగింది.అయితే అదే రోజున వస్తుందా .. లేదా? అనే సందేహం అభిమానుల్లో లేకపోలేదు. 

ఫ్యాన్స్ అనుమానాలు పటాపంచలు చేస్తూ..  'అరవింద సమేత' విడుదల తేదీని ప్రకటించారు. అందరూ అనుకున్నట్టుగానే అక్టోబర్ 11 న ఎన్టీఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ పోస్టర్ లో ఎన్టీఆర్ -  పూజా హెగ్డే ఒక హోటల్ లో కూర్చుని ఉన్నారు. ఇక యంగ్ టైగర్ తన మొహానికి ఎడమ చెయ్యి అడ్డం పెట్టుకుని చిలిపిగా ఓ స్మైల్ ఇస్తున్నాడు. పక్కన పూజా అలా పైకి చూస్తూస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈ సినిమా కూడా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: