తెలుగులో పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో అనూహ్య క్రేజ్‌ సంపాదించుకున్న ఈయన తమిళంలో హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ఇది. స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న (తమిళం, తెలుగు)ద్విభాషా చిత్రం నోటా.   పొలిటికల్ జోనర్‌లో రూపొందిన సినిమా నోటా. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ ఐదో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజనా నటరాజన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, నాజర్, ఎంఎస్‌.భాస్కర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

అరిమానంబి, ఇరుముగన్‌ చిత్రాల ఫేమ్‌ ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ప్రత్యేకించి విజయ్ దేవరకొండఇటీవలి సినిమా ‘గీతగోవిందం’ సంచలన విజయం సాధించి ఉండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు దీని రూపకర్తలు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు పబ్లిక్ మీటింగ్స్ అని పేరు పెట్టినట్టుగా సమాచారం. 

ఈ మద్య వరుసగా పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో వస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.   ఈ సినిమా గురించి హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎణ్ణిత్తుణిక్కరుమమ్‌ అనే తిరుక్కురల్‌ వ్యాఖ్యలను బట్టి పడుతూ కూర్చున్నానని అన్నారు. అయితే ఇప్పుడు తిరుక్కురల్‌ను అప్పజెప్పేస్థాయికి వచ్చానన్నారు. ఈ సినిమా గురించి ట్విట్టర్లలో తరచూ మరణ వెయిటింగ్‌ అని పోస్ట్‌ చేశారని, అదే విధంగా ఈ చిత్ర విడుదల కోసం తానూ మరణ వెయిటింగ్‌లో ఉన్నానని పేర్కొన్నారు.

నోటా సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల మనసులను గెలవాలని ఆశ పడుతున్నానని అన్నారు. విజయ్‌దేవరకొండ తిరుక్కురల్‌లోని ఒక వచనాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నెల 30న విజయవాడలో నోటా ‘పబ్లిక్ మీటింగ్’ జరగబోతోందని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల ఒకటో తేదీన హైదరాబాద్‌లో మరో పబ్లిక్ మీటింగును నిర్వహించనున్నారట. మొత్తానికి సినిమాకు తగ్గట్టైన రీతిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: