బిగ్ బాస్ ఫైనల్ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టంట్స్ లో కౌశల్ కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్న వార్త్రలు వస్తున్నాయి. కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో కౌశల్ ఫైనల్ వరకు వచ్చాడు. అయితే హౌజ్ లో కంటెస్టంట్స్ అంతా ఒక సైడ్ ఉంటే కౌశల్ ఒక్కడు మరో సైడ్ ఉన్నాడు. 109 రోజుల ప్రయాణంలో కౌశల్ చూపించిన స్పోర్టింగ్ స్పిరిట్ అందరిని ఆశ్చర్యపరచింది.


ఇక ఫైనల్ విన్నర్ టాస్క్ కు వచ్చే సరికి ఓటింగ్ పై ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. కౌశల్ ఆర్మీ ఇప్పటికే కౌశల్ ను టైటిల్ విన్నర్ గా చూడాలనే ఉద్దేశంతో ఓటింగ్స్ చేస్తున్నారు. ఈ ఓటింగ్ లెక్కలు చూస్తే బిగ్ బాస్ నిర్వాహకులే షాక్ అయ్యేలా ఉన్నాయి. కౌశల్ కు సపోర్ట్ గా 15 కోట్ల దాకా ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. 


దాదాపు 70 శాతం ఓట్లు కౌశల్ కే వేశారట. ఆ తర్వాత చాలా తక్కువ స్థానంలో గీతా మాధురి 15 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉందట. ఇక దీప్తి, సామ్రాట్, తనీష్ లు ఉన్నారు. వారికి తక్కువ శాతం ఓట్లే వచ్చాయని తెలుస్తుంది. కౌశల్ తరపున కేవలం కౌశల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రెగ్యులర్ గా బిగ్ బాస్ చూసే ఆడియెన్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది.  


ఈ లెక్కన చూస్తుంటే కౌశల్ బిగ్ బాస్ 2 టైటిల్ అందుకోవడం కన్ఫాం అని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని సమాచారం. బిగ్ బాస్ 2 ఫైనల్స్ లో ఇంటి సభ్యులందరికి వచ్చిన ఓట్లు బిగ్ బాస్ 2 ఫైనల్ ఓటింగ్స్ కు అది కూడా కౌశల్ కు వచ్చాయని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: