ఒకప్పటి ఇండస్ట్రీ కాదు, అప్పటి పద్ధతులూ లేవు, ఇపుడంతా మోడెర్న్ సొసైటీ. ఆ ప్రభావం అన్నిటి కంటే  టాలీవుడ్ పైనే  ఎక్కువగా పడుతోంది. తెలుగులో మన హీరోలకు నో రిటైర్మెంట్, జనాలు కూడా బాగానే  ఆదరిస్తున్నారు, వాళ్ళకు అరవైలు వచ్చినా హీరోలుగానే చూడాలనుకుంటున్నారు. డ్యూయెట్లు కూడా పాడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి స్టెప్పులేయడానికి హీరోయిన్లు కావాలిగా. 



అక్కడే వస్తోంది తంటా. ఇపుడు టాలీవుడ్లో టాప్ ఫోర్ సీనియర్లుగా ఉన్న చిరంజీవి, బాలక్రిష్ణ, వెంకటేష్, నాగార్జునలకు జత కుదరడం లేదు. వారి పక్కన నటించే జోడీ కోసమే నిర్మాతా, దర్శకుడు పడరాని పాట్లు పడుతున్నారు. దాంతో కధే చూసుకోవాలా, అమ్మాయిలనే వెతకాలా అని డైరెక్టర్లు తెగ ఫీల్ అవుతున్నారట.


చిరంజీవి విషయానికి వస్తే సిక్స్టీ  ప్లస్ లో ఉన్నారు. ఆయన ఖైదీ నంబర్ 150 మూవీతో హిట్ పట్టేసి మళ్ళీ రెడీ అంటున్నారు. నిజానికి ఆ మూవీలోనే ఆయన పక్కన పైర్ గా ఎవరూ దొరకలేదన్న టాక్ నడచింది. మొత్తానికి కొడుకు పక్కన నటించిన కాజల్ అగర్వాల్ ని తెచ్చి అయిందనిపించారు. 


ఆ తరువాత సైరా మూవీలో నయనతారను తీసుకున్నారు. ఇది హిస్టారికల్ మూవీ కాబట్టి ఫరవాలేదు. ఇక కొరటాల డైరెక్షన్లో చిరంజీవి లేటెస్ట్ మూవీ నవంబర్లో స్టార్ట్ కాబోతోంది. దీంతో టెన్షన్ మొదలైంది. హీరోయిన్ గా మొదట అనుష్క అనుకున్నా ఇపుడు తమన్నా పేరు వినిపిస్తోంది. ఈ ముద్దు గుమ్మ సరేనందని టాక్. కానీ ఆమె జీరో సైజ్ కి మెగాస్టార్ బాగానే సన్నబడాల్సిఉంటుంది. మొత్తానికి తమన్నా  ఒకే అనడంతో మెగా క్యాంప్ ఊపిరి తీసుకుంది.


మరో టాప్ హీరో బాలక్రిష్ణ పరిస్తితి ఇలాగే ఉంది. ఆయన ఇపుడు నటిస్తున్న  అన్న నందమూరి బయపిక్ లో  హీరోయిన్ అవసరం పెద్దగా లేకపోయింది. కానీ బోయపాటి మూవీకి మాత్రం గట్టిగానే వెతుకుతున్నారు. త్రిషను మళ్ళీ పైర్ గా తీసుకుంటారని టాక్ వచ్చినా ఔట్ డేటెడ్ అని ఆలోచిస్తున్నారుట. బాలయ్య పక్కన కాజల్,  తమన్నా లాంటి వాళ్ళు నటించేందుకు రెడీగా లేరంటున్నారు.  అయితే శ్రియనే మళ్ళీ చూడాలి. దాంతో బాలయ్య మూవీకి కూడా హీరోయిన్ ప్రోబ్లం చాలానే  ఉంది.


నాగార్జున, వెంకటేష్  మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నా వారి పక్కన కూడా జంట ఎవరూ  కుదరటంలేదట. లేటేస్ట్ మూవీ దేవదాస్ లో నాగ్ పక్కన ఎందరి పేర్లో అనుకుని అడిగిన తరువాత ఆకాన్షా సింగ్ ని పెట్టారు. ఇక బంగార్రాజు సీక్వెల్ కి కూడా హీరోయిన్ ట్రబుల్ ఉందంటున్నారు. 


వెంకటేష్, వరుణ్ తేజ్ మూవీలో వెంకీ పక్కన తమన్నాని తీసుకున్నారు. తరువాత సినిమాలకు మాత్రం పెద్ద సమస్య హీరోయినే అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే సీనియర్లకు హీరోయిన్లు దొరకడంలేదు. చాన్సులు లేకపోతే పోయే పెద్ద హీరోలతో వేయమని ముఖం మీదే చెప్పేస్తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: