అందలా తార శ్రీదేవి కూతురంటే అందమొక్కటే కాదు, అన్నీ ఉండాలి. మరి ఆమె పెద్ద కూతులు తల్లి అంత కాకపోయినా అందగత్తెగానే చెప్పాలి. దఢక్ మూవీతో కుర్ర గుండెలకు దడ పుట్టించింది. రోమంటిక్ లుక్ తో ఔరా అనిపించేసింది. లేటేస్ట్ గా మరో మూవీని కూడా ఒప్పుకుంది. 


రెండో సినిమాగా ఒక భారీ ప్రాజెక్ట్ సైన్ చేసింది.  కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ పీరియడ్ డ్రామా పేరు 'తఖ్త్'.  ఈ సినిమాలో  కరీనా కపూర్.. రణవీర్ సింగ్.. అలియా భట్.. అనిల్ కపూర్.. భూమి పెడ్నేకర్.. విక్కీ కౌశల్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం  2020లో రిలీజ్ అవుతుందట. మరి ఈ మూవీ ముచ్చట్లు ఆలా ఉంచితే జహ్నవి ఇంటర్వ్యూలను బాగానే ఫేస్ చేస్తోంది.


రీసెంట్ గా బ్రైడ్ అనే మ్యాగజైన్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఎక్కడా దొరక్కుండా జాహ్నవి కపూర్ ఇన్లెక్ఖువల్ గా ఆన్సర్లు చెప్పి గాసిప్పురాయుళ్ళ నోళ్ళు మూయించేసింది. మీకు ఎవరంటే క్రష్ అన్న ప్రశ్నకు మసాలా జవాబు ఆశించిన విలేకరికి నోట మాట రానంతగా  అన్సర్  ఇచ్చింది శ్రీదేవి కూతురు.


ఒకసారేమో మ్యాట్ డామన్ మీద.. మరోసారి గురుదత్ మీద క్రష్  కలుగుతుంది. ఇదీ జాహ్నవి చెప్పిన ఆన్సర్. ర్. బాగుంది కదా ఈ ఇద్దరిలో .  ఒకరేమో 47 ఏళ్ళ హాలీవుడ్ స్టార్.. మరొకరు లెజెండరీ బాలీవుడ్ యాక్టర్. వీళ్లతో క్రష్ అంటే ఎవ్వరూ కూడా ఏం చెయలేరు. మరేం అనలేరు. గాసిప్పుల గోల అసలే ఉండదు. వామ్మో శ్రీదేవి కూతురు తెలివి అంటున్నారట.  


అందరిలాగా హృతిక్ అనో..  రణబీర్ కపూర్ అనో   చెప్పి ఉంటే మాత్రం జాహ్నవి పేరు మీడియాలో రచ్చ అయ్యేది. ఇకపోతే తెలుగులో కూడా ఈ అమ్మడు మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే జహ్నవి అందాలను తెలుగు వెండితెర మీద కూడా ఎంచక్కా చూసేయొచ్చు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: