‘కబాలి’, ‘కాలా’ వంటి డిజాస్టర్స్ తర్వాత రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెట్టా’. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా ఒకప్పుడు చంద్రముఖి స్టైల్లో హర్రర్ కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్లు సమాచారం.  కబాలి, కాలా సినిమాలో రజినీ పండిన తలకట్టు - మీసం- గడ్డంతో  మాస్ లుక్ తో కనిపించాడు.  అయితే పెట్టా సినిమాలో కూడా గ్యాంగ్ స్టర్ లుక్ తో కనిపించిన రజినీకాంత్.. తెల్ల డ్రెస్‌లో తమిళ మీసకట్టులో విభూది రేఖలతో ఉన్న రజినీకాంత్ లుక్ టెర్రిఫిక్‌గా ఉంది.

హీరోగా రజినీకాంత్‌కు ఇది 165వ సినిమా. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ వారణాసిలో శరవేగంగా జరుగుతోంది. వీటన్నిటినీ మించి రొయ్య మీసం హైలైట్. రాయుడిలా.. రోషగాడిలా తిప్పేశాడు మీసాన్ని తిప్పి ఈసారికి పూర్తిగా యంగ్ బోయ్ గా మారిపోయాడంటే రజనీ చాలా పెద్ద ప్రయోగానికే రెడీ అవుతున్నాడన్నమాట. అయితే రజినీకాంత్ ఏం చేసినా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతారన్న విషయం తెలిసిందే. గతంలో సిగరెట్ గాల్లో ఎగరేసి పెదవి అంచుతో అందుకుని గుప్పున రింగు రింగుల పొగ వదిలితే..కుర్రాళ్లంతా ఫిదా అయ్యేవారు. 

ఆటోవాలా  కాకీ చొక్కా తొడుక్కుని కార్మికుడిగా కనిపించినా - చంద్రముఖిలో లకలకలక అంటూ వెరైటీగా డైలాగ్ చెప్పినా..మాఫియా డాన్ మాణిక్ బాషా గా నేను ఒక్కసారి చెబితే..వంద సార్లు చెప్పినట్లే అనే డైలాగ్.. శత్రువుల భరతం పట్టే చిట్టీ రోబోట్ గా ఎలాంటి పాత్రలైనా రజినీ కోసమే క్రియేట్ చేశారా అన్న విధంగా జీవించే ఈయన ఈసారి కొత్త లుక్ లో కనిపించడం చూసి అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.   

ఈ మూవీలో రజినీకాంత్ సరసన త్రిష, సిమ్రాన్‌లు నటిస్తున్నారు. విజయ్ సేతుపతి మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇంకోవైపు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ కూడా ‘పెట్టా’లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. అనిరుథ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. వారణాసిలో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: