ఒక డైరెక్టర్..ఒక సినిమా..ఇది కామన్..ఒకే డైరెక్టర్ ఒక్క నెలలో మూడు సినిమాలు అంటే మ్యాటర్ కాస్త ఆలోచించాల్సిందే.  ప్ర‌పంచంలో ఎక్క‌డైనా జ‌రుగుతుందా ఇది..? అంటే అవును జరుగుతుంది..జరిగింది.  ఒక్క ఏడాదిలో ఒక్క సినిమా రావ‌డ‌మే గ‌గనంగా మారిన రోజులు ఇవి. అలాంటిది ఒకే నెల్లో రెండు సినిమాలు రావ‌డం.. ఆ లెక్క ఇప్పుడు మూడు సినిమాల‌కు చేర‌డం అద్భుతం..ఈ వండర్ ఒక్క క్రిష్ కే దక్కిందని చెప్పొచ్చు.   మొదటి నుంచి విభిన్నమైన సినిమాలకు వేధికగా నిలుస్తున్న దర్శకుడు క్రిష్ ప్రస్తుతం టాలీవుడ్ మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. 


ఈ సినిమాలో ఎన్టీఆర్ గా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు.  అయితే ఈ సినిమాకు ముందు బాలీవుడ్ లో స్వాతంత్రం కోసం పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా ‘మణికర్ణిక’ సినిమా తెరకెక్కించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.  అప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యిందని టాక్ వచ్చింది.  క్రిష్ ప్లేస్ లో ఇప్పుడు కొన్ని సీన్లు బాలీవుడ్ క్విన్ కంగనా రౌనత్ తీస్తున్నట్లు సమాచారం. 

ఈ సినిమా తీస్తున్న సమయంలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాధ్యతలు తన భుజంపై వేసుకున్నారు క్రిష్.   ప్ర‌స్తుతం "ఎన్టీఆర్" బ‌యోపిక్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇన్నాళ్లూ ఒకే పార్ట్ అనుకున్నారు కానీ రెండు భాగాలుగా వ‌స్తుంద‌ని ఇప్పుడు క‌న్ఫ‌ర్మ్ చేసారు. తొలిభాగం "క‌థానాయ‌కుడు" సినిమా జీవితంపై.. రెండో భాగం "మ‌హానాయ‌కుడు" రాజ‌కీయాల‌పై రానుంది.

జ‌న‌వ‌రి 9న "క‌థానాయ‌కుడు" విడుదల కానుంది..దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.  కొద్ది గంటల్లోనే  "మ‌హానాయ‌కుడు" రిలీజ్ చేసి  24న విడుద‌ల కానుందని ప్రకటించారు. కంగ‌న ర‌నౌత్ హీరోయిన్ న‌టించిన ఈ సినిమా ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్‌గా తెర‌కెక్కించాడు క్రిష్. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్ష‌న్‌లో బిజీగా ఉంది.  ఇలా ఒకే నెలలో వరుసగా ఒక దర్శకుడి సినిమాలు రిలీజ్ కావడం  ఇండస్ట్రీలో ఓ హిస్టరీ అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: