విజయదేవర కొండ నటించిన నోటా సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ను స్వంతం చేసుకున్నది ఎంచుకున్నది మంచి స్టోరీ లైన్ అయినప్పటికీ దానిని డీల్ చేయడం లో డైరెక్టర్ ఘోరంగా విఫలమయ్యాడు. కోలీవుడ్ టాప్ హీరోలు అజిత్, విజయ్, సూర్యకు పోటీని ఏర్పరిచే రీతిలో తొలి సినిమాతో మాస్ హీరోగా అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. తమిళం తెలియకపోయినా.. సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకుని శభాష్ అనిపించుకున్నాడు. మీడియాను బెదిరించడం, సీఎం అయిన తర్వాత వున్నట్టుండి తీసుకున్న నిర్ణయాల్లో తన నటనను కనబరిచాడు. 

 Image result for nota vijay devarakonda
ఇక ఈ సినిమా హీరోయిన్ మెహ్రీన్‌కు పెద్దగా పనేంలేదు. అయితే మరో హీరోయిన్‌గా సంజన క్యారెక్టర్.. ఇప్పుడున్న మహిళా రాజకీయ నేతల ఛాయలను ఉట్టిపడేలా చేసింది. మహిళా రాజకీయ నేతగా సంజన నటన అదరగొట్టింది. సీఎం విజయ్‌కి చాణక్యుడిగా, రాజకీయాలు నేర్పించే గురువుగా, సీనియర్ జర్నలిస్టుగా సత్యరాజ్ నటించాడు. మేకప్ లేకుండా సత్యరాజ్ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజకీయ నాయకుడిగా నాజర్ క్యారెక్టర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎస్.ఎస్ భాస్కర్ కొన్ని సన్నివేశాల్లో కనిపించినా.. నటనా పరంగా అదరగొట్టాడు.

నోటా ను చూసే నాధుడే లేడా... ప్రేక్షకులు నుంచి ఘోరమైన స్పందన...!

 
శ్యామ్ సి.ఎస్ సంగీతంలో పాటలు సుమారుగా వున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపడేలా వుంది. తొలి రెండు పాటు, కరుణాకరన్, యాషికా సన్నివేశాలను ఎడిటర్ దయాదాక్ష్యిణ్యాలకు పోకుండా కట్ చేసివుంటే బాగుండేది. వీరిద్దరి క్యారెక్టర్లు సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండా వున్నాయి. దర్శకుడు ఆనంద్ శంకర్ ఓ సస్పెన్స్ రాజకీయ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడంలో విఫలమయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: