టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సుమధుర గీతాలు పాడి..ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.  ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసుగా బయోపిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి.  ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’ సినిమా తీశారు.  ఈ సినిమా అనుకున్నదాని కన్నా రెట్టింపు విజయం సాధించింది. అంతే కాదు ఇప్పుడు ఎన్టీర్ బయోపిక్, వైఎస్సార్ ఇలా పలువురి సెలబ్రెటీల జీవితాల కథ ఆధారంగా చేసుకొని సినిమాలు తీస్తున్నారు. 

సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్న వారికి సంబంధించి  ఈ బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే అమరగాయకుడు ఘంటసాల జీవితచరిత్ర కూడా తెరపైకి రానుంది. ఘంటసాల దంపతులుగా గాయకుడు కృష్ణచైతన్య .. ఆయన భార్య మృదుల నటించారు. సిహెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. 

అయితే ఈ సినిమాకు అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమా తమ పరిమిషన్ లేకుండా తమను సంప్రదించకుండా ఘంటసాల'గారి జీవితచరిత్రను రూపొందించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘంటసాల తనయుడు రత్నకుమార్ పత్రికాముఖంగా తెలియజేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: