మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ గా మొన్నటిదాకా స్టేట్ రౌడీ అని వినిపించగా కొత్తగా ఇప్పుడు మరో రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి.


అందులో ఒకటి సాఫ్ట్ టైటిల్ వినయ విధేయ రామా కాగా రెండోది రౌడీ తమ్ముడు అని తెలుస్తుంది. బోయపాటి మార్క్ సినిమాగా వస్తున్న ఈ మూవీకి టైటిల్ గా వినయ విధేయ రామా అని పెడతారని అనుకోవట్లేదు. ఆల్రెడీ బోయపాటి రీసెంట్ మూవీ జయ జానకి నాయకా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు.


అయితే వినయ విధేయ రామా మాత్రం చరణ్ కు సూటయ్యే టైటిల్ అంటున్నారు. ఇక ఇది కాకుండా రౌడీ తమ్ముడు అన్న టైటిల్ కూడా వినిపిస్తుంది. స్టేట్ రౌడీ పాతగా ఉంటుందని అందులోని రౌడీని పవన్ సినిమా టైటిల్ అయిన తమ్ముడిని కలిపి రౌడీ తమ్ముడు అని పెట్టబోతున్నారని అంటున్నారు.


ఇక ఈ సినిమా టైటిల్ ను దసరా నాడు రివీల్ చేయబోతున్నారట. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగ టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. రంగస్థలం తర్వాత చరణ్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ తో పోటీ పడుతున్న చరణ్ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: