ఈ నెల 11 న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘అరవింద సమేత’ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించబోతున్నాడట.  ఫస్ట్ పార్ట్ కాస్త ఎంట్రటైన్ మెంట్ గా సాగినా..సెకండాఫ్ మాత్రం ఫ్యాక్షన్, సెంటిమెంట్ తో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందట. 
Image result for aravinda sametha jagapathi babu
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ఎంత గొప్పగా నటించాడో..విలన్ గా జగపతిబాబు కూడా అదే రేంజ్ లో మెప్పించాడట.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ వర్క్ లో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.  ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాను. కొత్త కోణంలో ఈ సినిమాను ఆవిష్కరించాననే అనుకుంటున్నాను. 
 ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్
ఈ సినిమాలో ఎమోషనల్ గా సాగే 'పెనివిటి' సాంగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.  ఇక తమ ఆదిపత్యం సాగాలి..తమ అహం ఎక్కడా దెబ్బతినకూడదు అనే పాత్రలో జగపతి బాబు చాలా కృరమైన స్వభావంతో కనిపిస్తాడని అన్నారు.  ఆయన క్యారెక్టర్ కి తగ్గట్టుగానే లుకింగ్ కూడా ఉంటుందని అన్నారు. 
 ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్
ఈ సినిమా చూసిన వాళ్లంతా ఆయన పాత్రను ద్వేషిస్తారు. ఇక పవన్ తో చేయాలనుకున్న కథను .. ఎన్టీఆర్ తో చేశాననే ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజంలేదు.  ఈ సినిమా కథ మొదటి నుంచి ఎన్టీఆర్ కోసమే అని రాసిపెట్టుకున్నానని అన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.  


మరింత సమాచారం తెలుసుకోండి: