ఈమద్య టివిలో ఎయిర్ టెల్ యాడ్స్ తో తెగ పాపులర్ అయిన అమ్మాయి సాషా చెత్రీ. 4జీ అంటూ యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఎయిర్ టెల్ 4జీ యాడ్స్ లో కనిపించే అమ్మాయి అనగానే మెరుపుతీగలాంటి ఒక రూపం కళ్లముందు కదలాడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి పేరు 'సాషా చెత్రీ' అనే విషయం అందరికీ తెలిసుండకపోవచ్చు. ఎయిర్ టెల్ యాడ్స్ లో కనిపించే ఆ అమ్మాయి నవ్వు .. ఆమె కళ్లలోని మెరుపు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వివిధ భాషల నుంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయి. 

Image result for ఎయిర్ టెల్ 4జీ  సాషా చెత్రీ

బాలీవుడ్ తో పాటు అన్ని భాషల నుండి కూడా ఈమెకు ఛాన్స్ వస్తున్నాయి.  తెలుగులో సాషా చెత్రీకి  అడవి సాయి కిరణ్ మొదటి ఛాన్స్ ను ఇచ్చాడు. తెలుగులో ఈమెను నటింపజేసేందుకు ఆయన చాలా కష్టపడ్డాడు. మొదటి సినిమా విడుదల కాకుండానే మరో సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చింది.  ఇక రెండవ ఛాన్స్ ను ఏకంగా 'సాహో' లోనే కొట్టేసింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను  సాషా చెత్రీ అయితే బాగుంటుందని భావించి సంప్రదించారట. ప్రభాస్ మూవీ అనగానే ఈ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. 


ప్రభాస్ కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్న ఈ చిత్రంలో సాషాను కూడా ఎంపిక చేయడంతో హిందీ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించవచ్చు అని దర్శకుడు సుజీత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బహు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఈ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నట్టుగా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: