జూనియర్ కి సెంటిమెంట్ మరో మారు కలసి రానుంది. దానికి తోడు కంటెంట్ కూడా బాగా కుదరడం, పోటీ ఏదీ లేకపోవడంతో దసరా బుల్లోడుగా కలెక్షన్లు  దున్నేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.ఈ రోజు ఓవర్సీస్ లో రిలీజ్ అయిన అరవింద సమేత వీర రాఘవుడికి మంచి రివ్యూస్ పడ్డాయి. త్రివిక్రం మళ్ళీ తన సత్తా చాటేలా మూవీలో వీర విజ్రుంభణ చేశాడని, జూనియర్ నటన అదుర్స్ అని అంటున్నారు. బాబాయ్ బాలయ్య సంక్రాంతి బుల్లోడు అయితే అబ్బాయ్ దసరా బుల్లోడు అంటున్నారు.


దాంతో ఈ సినిమా తెలుగు జనాలకు దసరా వేళ బాగా కనెక్ట్ అవుతుందని కూడా ఫిల్మ్ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ సీజన్ కూడా బాగా కలసివచ్చిందని అంటున్నారు. నాలుగు రోజుల క్రితం విడుదలైన నోటా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇక సోలోగా అరవింద సమేత దూసుకుపోతాడని అంటున్నారు. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపధ్యంలో సూపర్ డూపర్ హిట్ అయ్యే చేన్సెస్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. దసరా నవరాత్రులు ఈ రోజు మొదలయ్యాయి. జూనియర్ సినిమా అరవింద సమేత వీర రాఘవుడు రేపు (గురువారం) ధియేటర్లలో విడుదలై మొత్తం దసరా సందడిని తీసుకువచ్చేస్తోంది.


దసరా కూడా జూనియర్ కి కలసివస్తుందంటున్నారు. అపట్లో దసరాకు వచ్చిన బ్రుందావనం మూవీ జూనియర్ కెరీర్ లో ఓ బిగ్ హిట్ గా నిలించిందని, ఆదే తీరులో అరవింద సమేత కూడా మంచి హిట్ కొట్టడం  ష్యూర్ అని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇక జూనియర్ కూడా ఈ మధ్య తండ్రి హరిక్రిష్ణను కోల్పోయి బాధల్లో ఉన్నాడు, అయినా అరవింద టైం కి రిలీజ్ కావాలని అన్నీ అణచుకుని పనిచేశాడు. చివరికి అతను పడ్డ కష్టానికి ఘన విజయం దక్కేలా కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యాన్స్ కి మాత్రం ఇది శుభవార్తే.



మరింత సమాచారం తెలుసుకోండి: