భారతీయ సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ఉద్యమం ఉధృతం అవుతుంది.  హీరోయిన్లు గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు.  ఆ మద్య నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చింది..కానీ అప్పట్లో ఆమె కొన్ని విషయాల్లో నోరు జారడం వల్ల అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.  దాంతో శ్రీరెడ్డి సోషల్ మీడియా సాక్షిగా కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం చేస్తుంది.  ఇప్పుడు బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి నానా బిభత్సం అవుతుంది.  ఇప్పటికే తనుశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు గతంలో తమపై లైంగిక దాడులు జరిగాయని చెప్పిన విషయం సంచలనం సృష్టిస్తుంది. 


ఇప్పటి వరకు బాలీవుడ్ లో నానాపటేకర్, గణేశ్ ఆచార్య, కోలీవుడ్ లో గేయ రచయిత వైరముత్తు, మలయాళంలో నటుడు ముఖేశ్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో మరికొంత మంది హీరోయిన్లు కూడా గతంలో తమపై జరిగిన లైంగిక దాడులు గురించి ప్రస్తావిస్తున్నారు.  తాజాగా హీరోయిన్ అదితీరావు హైదరీ మాట్లాడుతూ..కాంప్రమైజ్ అయి కోరిక తీరిస్తే 3 సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని కొందరు తనకు గతంలో ఆఫర్ చేశారని అదితీరావు చెప్పింది. కానీ అలాంటివి వద్దనుకుని తాను వచ్చేశానని వెల్లడించింది.  


కొత్తవాళ్లు సినిమా పరిశ్రమలో ఎదగడం చాలా కష్టమనీ, అయితే అసాధ్యం మాత్రం కాదని స్పష్టం చేసింది. దానికి తానే ఉదాహరణ అని చెప్పింది.  కాకపోతే కొంత మంది బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి దళారులు హీరోయిన్లను వేధించి...మభ్య పెట్టి ఛాన్స్ లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.  సినీ పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని అదితీరావు హైదరీ చెప్పింది. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: