కొంత మందికి జంతువులు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది..అయితే సాదు జంతువులైతే ఒకే కానీ కృరజంతువులు వాటిని సాకాంటే చాలా కష్టం..అంతే కాదు ప్రభుత్వం కూడా అనుమతించదు. తాము అభిమానించే జంతువులను కొంత మంది దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ నటుడుగానే కాకుండా జంతు ప్రేమికుడిగా మారారు.

తాజాగా ఆయన చెన్నై వండలూర్‌లోని అరిగ్నర్ అన్నా జూలాజికల్‌ పార్క్‌లోంచి 10 సంవత్సరాల తెల్లపులిని దత్తత తీసుకోనున్నారు. అను పేరుతో ఉన్న ఆ పులిని ఆరు నెల‌ల పాటు ద‌త్త‌త తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇండియాలోని 1952 నుంచి ప్రతి యేటా అక్టోబర్‌ 2 నుంచి 8 తేదీ వరకు వన్యప్రాణుల వారోత్సవాలు జరుపుతున్నారు.  తెల్ల పులిని 2.12 ల‌క్ష‌లు చెల్లించి ద‌త్త‌త తీసుకున్నాడు శివ‌కార్తికేయ‌న్. బీష్మ‌ర్ అనే పులి ఒక మ‌గ‌, రెండు ఆడ‌పులుల‌కి జ‌న్మ‌నివ్వ‌గా వాటికి ఆక‌న్ష‌, న‌ర్మ‌ద, అను అని పేర్లు పెట్టారు. అను అనే పులిని 2006లో ఢిల్లీ నుండి చెన్నైకి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం

ఈ సందర్బంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ..జంతువుల‌ని కాపాడ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. ప్ర‌తి ఒక్కరు ముందుకు వ‌చ్చి 174 జాతుల‌లో క‌నీసం ఒక్క‌దాన్నైన ద‌త్త‌త తీసుకోవాల‌ని అన్నారు. ఇదిలా ఉంటే శివ‌కార్తికేయ‌న్ ఇటీవ‌ల ‘సీమరాజా’గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఎం.రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: