ఈ మద్య ఇండస్ట్రీలో ‘మీ టూ ’ ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది.  గతంలో తమపై చేసిన లైంగిక దాడుల గురించి కొంత మది సెలబ్రెటీలు, హీరోయిన్లు బహిరంగంగా మీడియా ముందు చెప్పుకొని బాధపడటం..వారి గుట్టు రట్టు చేయడంతో ఇదే విషయంపై ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై కొంత మంది మద్దతు ఇవ్వగా...మరికొంత మంది ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  అయితే టాలీవుడ్, కోలీవుడ్ ‘మీ టూ ’ ఉద్యమంపై యాక్టీవ్ గా పోరాడుతున్న సింగర్ చిన్మయి కి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. గాయని చిన్మయి, సాహిత్య రచయిత వైరాముత్తుల వివాదం తమిళ సినీరంగంలో సంచలనంగా మారింది.


స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత వైరాముత్తు తనను గదికి వచ్చి కోపరేట్ చేయాలని కోరాడంటూ చిన్మయి ఇటీవల ట్వీట్టర్ వేదికగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు బయటపెట్టేందుకు సింగర్ చిన్మయిని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి ఆయా మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దీంతో ఆమె ఇంటర్వ్యూ కోసం తమిళనాడుకు చెందిన మీడియా చాలా ప్రయత్నిస్తోందట.


కానీ ఈ పరిస్థితులే చిన్మయి, ఆమె కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారాయి. ఇంటర్యూ కోసం మీడియా వర్గాలు చిన్మయిని విసుగిస్తున్నాయట. ముఖ్యంగా తమిళనాడు మీడియా వర్గాలు ఆమె ఇంటర్వూ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన చిన్మయి తన తల్లికి కాల్స్ చెయ్యొద్దని తమిళనాడు మీడియా వర్గాలకు విన్నపం చేసింది.


‘చెన్నై మీడియా వర్గాలకు విన్నపం. మాటిమాటికీ మా అమ్మకు ఫోన్‌ కాల్స్‌ చేసి ఆమెను ఇబ్బందిపెట్టకండి. ఫోన్లు చేయడం మానుకోండి. ఆమె వయసు 69. ఆమె చాలా ఒత్తిడికి గురవుతున్నారు. పదేపదే తన తల్లికి ఫోన్లు చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. 'దయచేసి ఆమెకు కాల్స్ చేయకండి' అంటూ మీడియాను ఆమె కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: